New York: న్యూయార్క్‌లో షాకింగ్ ఘటన.. విమానం గాల్లో ఉండగా ఊడిపడిన డోర్.!
అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్ ఊడి కిందపడింది. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం చేరువవుతున్న సమయంలో ఓ చిన్న విమానం డోర్ గాల్లో నుంచి కిందకు పడిపోయింది. కాగా డోర్ కోసం వెతికినా అది ఎక్కడా దొరకలేదని బఫెలో సిటీ శివారులోని చీక్టోవాగా సబ్‌అర్బన్ పోలీసులు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్ ఊడి కిందపడింది. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం చేరువవుతున్న సమయంలో ఓ చిన్న విమానం డోర్ గాల్లో నుంచి కిందకు పడిపోయింది. కాగా డోర్ కోసం వెతికినా అది ఎక్కడా దొరకలేదని బఫెలో సిటీ శివారులోని చీక్టోవాగా సబ్‌అర్బన్ పోలీసులు తెలిపారు. విమానంలోని ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని వివరించారు. ఈ ఘటన కారణంగా ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో డోర్ ఊడిపడిందని వివరించారు. ఈ విమానం ఎయిర్‌పోర్టుకు దక్షిణ దిశలో కొన్ని మైళ్ల దూరం ప్రయాణించిందని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

