Police – Snake: పాముకు ఊపిరిలూది ప్రాణం పోసిన పోలీసు.. వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. వాటి దగ్గరకు వెళ్లేందుకు కూడా సాహసించరు. అవి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అదే పోతుందిలే అని పట్టించుకోకుండా వెళ్లిపోతారు. కానీ ఓ పోలీసు అలా చేయలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాముకు ఊపిరి ఊది ప్రాణం పోసాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆ పోలీసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. వాటి దగ్గరకు వెళ్లేందుకు కూడా సాహసించరు. అవి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అదే పోతుందిలే అని పట్టించుకోకుండా వెళ్లిపోతారు. కానీ ఓ పోలీసు అలా చేయలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాముకు ఊపిరి ఊది ప్రాణం పోసాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆ పోలీసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరూ పోలీసులలో కాఠిన్యాన్ని మాత్రమే చూస్తారు. కానీ మాలోని మనసుంది.. అది మానవత్వంతో స్పందిస్తుందని నిరూపించారు మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అతుల్ శర్మ. నర్మదాపురంలోని రెసిడెన్షియల్ కాలనీలో పురుగుల మందు ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది ఓ పాము. విషయం తెలుసుకున్న హరిచంద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అతుల్‌శర్మ అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు. వెంటనే పాము ముఖాన్ని నీటితో శుభ్రం చేసి దానికి సపర్యలు చేశారు. అయినా పాము స్పృహలోకి రాలేదు. అనంతరం కానిస్టేబుల్ పాము నోటిలోకి గాలి ఊదారు. కొద్దిసేపటికి ఆ సర్పం స్పృహలోకి వచ్చింది. అనంతరం పామును తీసుకెళ్లి అటవీప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. కానిస్టేబుల్ చేతిలో ప్రాణం పోసుకున్న ఆ పాము తన ఆవాసంలోకి వెళ్లిపోయింది. గత 15 సంవత్సరాలుగా తాను కొన్ని వందల పాములను రక్షించానని అతుల్ శర్మ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..