AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Dog: స్విమ్మింగ్ పూల్ పడిపోయిన పమేరియన్.. అది చూసిన దాని ఫ్రెండ్ ఏం చేసిందో చూస్తే ఫిదా అయిపోతారు Viral Video

సాధారణంగా జంతువులు ప్రమాదాల బారిన పడితే మానవులు వాటిని కాపాడటం జరుగుతుంది. ఒక్కోసారి మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగినపుడు.. వారి పెంపుడు జంతువులు వారిని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తాయి.

Hero Dog: స్విమ్మింగ్ పూల్ పడిపోయిన పమేరియన్.. అది చూసిన దాని ఫ్రెండ్ ఏం చేసిందో చూస్తే ఫిదా అయిపోతారు Viral Video
Pet Dog
KVD Varma
|

Updated on: Apr 22, 2021 | 10:08 PM

Share

Hero Dog: సాధారణంగా జంతువులు ప్రమాదాల బారిన పడితే మానవులు వాటిని కాపాడటం జరుగుతుంది. ఒక్కోసారి మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగినపుడు.. లేదా ప్రమాదకర పరిస్థితులలో ఉన్నపుడు వారి పెంపుడు జంతువులు వారిని రక్షించడం కోసం వేరే వారి సహాయాన్ని కోరే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక జంతువు ప్రమాదంలో ఉంటె మరో జంతువు ఎవరిదైనా సహాయం కోసం చూడటం సహజం. కానీ, ఆ జంతువును తానే స్వయంగా రక్షించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే, ఆ ప్రమాదం నుంచి కాపాడే జ్ఞానం..చాకచక్యం ఇతర జంతువుకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఒక పెంపుడు కుక్క మరో పెంపుడు కుక్కను ప్రమాదం నుంచి కాపాడి ప్రాణం పోసిన సంఘటన గురించి.

ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని జోహెన్ బర్గ్ లో జరిగింది. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో చకీ అనే పమేరియన్ జాతి కుక్క స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. దానిని చూసిన జేసీ అనే పెంపుడు కుక్క చాలా కష్టపడి రక్షించింది. చకీ ఒక వంతెన దగ్గర నిలబడి ఉంటుంది. అనుకోకుండా కాలు జారి అది నీటిలో పడిపోయింది. దీంతో అది భయపడి పైకి తేలుతూ ఉండడటం కోసం పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో అక్కడికి జెస్సీ వచ్చింది. చకీ నీటిలో పడిపోవడం చూసింది. ఇక దానిని రక్షించడానికి తన ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపుగా 34 నిమిషాల పాటు అది చకీని రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. వంతెన చుట్టూ తిరుగుతూ.. చకీని నోటితో పట్టుకుని పైకి లాగాలని జెస్సీ అపూర్వ ప్రయత్నం చేసింది. మొత్తమ్మీద దాదాపు అరగంట గడిచాక దాని ప్రయత్నం ఫలించింది. తన దంతాలతో చకీ ని పట్టుకుని ఒడ్డుకు ఈడ్చగలిగింది. మొత్తమ్మీద ఈ ప్రయత్నంలో అంతసేపు జెస్సీ..అలుపు లేకుండా..పట్టు వదలకుండా ప్రయత్నించడం ఆకట్టుకుంటుంది.

ఈ రెండు కుక్కలూ బైరాన్ తన్రేయన్, మెలిస్సా తన్రేయన్ దంపతుల పెంపుడు కుక్కలు. వారి ఇంటిలో ఉన్న సిసి కెమెరాలు ఈ సంఘటనను చిత్రీకరించాయి. దీనిని వారిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విడియో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జెస్సీ పట్టుదల, తెలివి ని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు దానికి ఉన్న ధైర్యానికి అంతా ఫిదా అయిపోతున్నారు.

ఆ వీడియోను మీరిక్కడ చూడండి..

Also Read: Southern Railway Jobs: రైల్వే పారామెడికల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. 191 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

International travel ban : భారత్ కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్న దేశాల జాబితాలో యూఏఈ కూడా చేరిపోయింది