Water to King Cobra: కింగ్ కోబ్రాకి దాహం వేస్తే.. శభాష్ బాస్.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్..
ఆకలి, దాహం జీవికైనా ఒకటే.. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి జీవి నీటికోసం అల్లాడుతుంది. అలా దాహంతో అల్లాడుతున్న ఓ కింగ్ కోబ్రాకు నీళ్లందించి ప్రాణం పోసాడు ఓ వ్యక్తి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సాధారణంగా పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు చాలామంది. ఇక కింగ్ కోబ్రా అంటే మాటలా.. పాములన్నిటిలోనూ అత్యంత విషపూరితమైనది, అతి పెద్దది కూడాను. అలాంటి పాము నీటికోసం అల్లాడుతుంటే అది విష జంతువని తెలిసికూడా మానవత్వంతో నీరు తాగించాడు ఓ వ్యక్తి. దాహంతో అల్లాడుతున్న ఆ జీవి ఎంతో ఆబగా నీళ్లు తాగింది. నీళ్తుతాగుతున్నప్పుడు ఆ పాము కళ్లలో సంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పాము పైపుద్వారా అందిస్తున్న నీటిని ఆర్తిగా తాగుతోంది. ఈ వీడియో ను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షలమందికి పైగా వీక్షించి లైక్ చేశారు. వేలాదిమంది తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ఆ వ్యక్తి మానవత్వాన్ని మెచ్చుకుంటూనే అతని ధైర్యానికి సలాం అంటున్నారు. అయితే ఇలా చేయడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!