Old Man with Son Body: కొడుకు శవంతో నాలుగు రోజులు గడిపిన తండ్రి.. చూస్తే కనీళ్ళు ఆగవు..(వీడియో)
82 ఏళ్ల వృద్ధుడు తన కొడుకు శవంతో నాలుగు రోజులపాటు గడిపిన విషాద ఘటన పంజాబ్ రాష్ట్రం మొహాలీలో వెలుగు చూసింది. ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు పోలీసులకు
82 ఏళ్ల వృద్ధుడు తన కొడుకు శవంతో నాలుగు రోజులపాటు గడిపిన విషాద ఘటన పంజాబ్ రాష్ట్రం మొహాలీలో వెలుగు చూసింది. ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. బల్వంత్ సింగ్ అనే వృద్ధుడు మరణించిన ఆయన పెంపుడు కుమారుడు సుఖ్విందర్ సింగ్ శవం పక్కనే కూర్చోని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న ఆయన.. దాదాపు స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నారు. దీంతో వెంటనే ఆ పెద్దాయన్ను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్వంత్ సింగ్‌కు పిల్లలు లేకపోవడంతో.. సుఖ్విందర్ సింగ్‌ను దత్తత తీసుకున్నారు. గత నెల రోజుల నుంచి వృద్ధుడు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదని స్థానికులు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

