YouTube star cheateing: ఫాలోవర్లను నిలువునా ముంచిన థాయ్‌ యూట్యూబ్‌ స్టార్‌.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందిగా..

YouTube star cheateing: ఫాలోవర్లను నిలువునా ముంచిన థాయ్‌ యూట్యూబ్‌ స్టార్‌.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందిగా..

Anil kumar poka

|

Updated on: Sep 05, 2022 | 10:14 AM

థాయిలాండ్‌ యూట్యూబ్‌ స్టార్‌ నత్తమోన్‌ ఖోంగ్‌చక్‌ తక్కువ సమయంలో యూట్యూబ్‌ స్టార్‌గా వెలిగిపోయింది. వేల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చారు. ఆమె చేసే ప్రతీ డ్యాన్సను ఆహా..! ఓహో..!


థాయిలాండ్‌ యూట్యూబ్‌ స్టార్‌ నత్తమోన్‌ ఖోంగ్‌చక్‌ తక్కువ సమయంలో యూట్యూబ్‌ స్టార్‌గా వెలిగిపోయింది. వేల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చారు. ఆమె చేసే ప్రతీ డ్యాన్సను ఆహా..! ఓహో..! అంటూ మెచ్చుకునే ఫాలోవర్లు ఆమెకు 8.47 లక్షల మంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఔత్సాహిక స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారుల కోసం ప్రైవేట్ కోర్సులకు ప్రచారం కూడా చేపట్టింది. తాను సాధించిన లాభాలను సైతం పోస్ట్ చేసింది.తాను, తన డ్యాన్సులంటే పడిచస్తున్న అభిమానులు, ఫాలోవర్లతో పెట్టుబడులు పెట్టించాలని యోచించిన నట్టి.. విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఇస్తానని నమ్మబలికింది. దాంతో 35 శాతం రాబడుల వాగ్ధానం మేరకు దాదాపు 6 వేల మంది ఫాలోవర్స్‌ ఆమె చెప్పినట్లుగా పెట్టుబడి పెట్టారు. అయితే, ఎంతకు లాభాలు పంచకపోవడంతో ఫాలోవర్స్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. కాగా, పెట్టుబడిదారులకు దాదాపు 27.5 మిలియన్‌ డాలర్లు బకాయిపడినట్లు చివరిసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో నట్టి పోస్ట్‌ పెట్టింది. బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తి తన ఖాతాలను, నిధులను గత మార్చ్‌ నుంచి బ్లాక్‌ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని నట్టి పేర్కొంది. తన ఫాలోయర్లను మోసం చేయడం తన ఉద్దేశం కాదని, వారికి త్వరలోనే వారి పెట్టుబడులను తిరిగి ఇచ్చేస్తానని నట్టి హామీ ఇచ్చింది. ఇలాఉండగా, నట్టిని అరెస్ట్‌ చేసేందుకు థాయిలాండ్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో వారంట్‌ జారీ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 05, 2022 10:05 AM