ఈ పెట్టె వెనుక పెద్ద చరిత్రే ఉంది.. దొంగలూ ఎత్తుకెళ్లలేరు వీడియో
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి ఉప ఖజానా కార్యాలయంలో 141 ఏళ్ల నాటి భారీ ఇనుప పెట్టె ఒకటి భద్రంగా ఉంది. 1884లో మద్రాస్‌లో తయారైన ఈ పెట్టె 3000 కిలోలకు పైగా బరువుంటుంది. దీని మూతనే 500 కిలోలు. బ్రిటీష్ కాలం నుంచి విలువైన నగదు, పత్రాలను భద్రపరిచేందుకు దీనిని ఉపయోగించారు.
పూర్వం విలువైన వస్తువులు, నగదు భద్రపరచడానికి పెద్ద ఇనుప పెట్టెలను ఉపయోగించేవారు. రాజుల కాలం నుండి ట్రంకు పెట్టెల వరకు, కాలక్రమేణా వీటి రూపాలు మారాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి ఉప ఖజానా శాఖ కార్యాలయంలో ఒక అద్భుతమైన చారిత్రక ఇనుప పెట్టె ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. చూడటానికి సాధారణంగా కనిపించే ఈ పెట్టె వెనుక గొప్ప చరిత్ర దాగి ఉంది. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే, అంటే 1884లో ఇది మద్రాస్‌లో తయారైంది. ఈ పెట్టె వయస్సు ప్రస్తుతం 141 సంవత్సరాలు. దీని బరువు దాదాపు 3000 కిలోలకు పైనే ఉంటుందని అంచనా. కేవలం మూత బరువే 500 కిలోలు కావడంతో, నలుగురైదుగురు కలిసి పైకి లేపితేనే గానీ దీనిని తెరవటం సాధ్యం కాదు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
