ఇకపై సుగర్‌ టెస్ట్‌కు బ్లడ్‌తో పనిలేదు.. పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త

ఇకపై సుగర్‌ టెస్ట్‌కు బ్లడ్‌తో పనిలేదు.. పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త

Phani CH

|

Updated on: Jan 03, 2024 | 12:47 PM

సాధారణంగా ఏ వ్యాధి నిర్ధారణకైనా ముందుగా బ్లడ్‌ చేయించడం సహజం. ఇటీవలి కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మధుమేహ వ్యాధిబారిన పడుతున్నారు. ఈ పరీక్ష చేయాలంటే సూదిగుచ్చి రక్తాన్ని సేకరించాల్సిందే. చిన్నారుల్లో మధుమేహాన్ని కొలిచేందుకు సూదితో పొడిచి శరీరం నుంచి రక్తం తీస్తున్నప్పుడు నొప్పి భరించలేక పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు గ్లూకోజ్‌ను నిర్ధారించడానికి ఎలక్ట్రోకెమికల్‌ పరికరాన్ని కనుగొన్నారు.

సాధారణంగా ఏ వ్యాధి నిర్ధారణకైనా ముందుగా బ్లడ్‌ చేయించడం సహజం. ఇటీవలి కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మధుమేహ వ్యాధిబారిన పడుతున్నారు. ఈ పరీక్ష చేయాలంటే సూదిగుచ్చి రక్తాన్ని సేకరించాల్సిందే. చిన్నారుల్లో మధుమేహాన్ని కొలిచేందుకు సూదితో పొడిచి శరీరం నుంచి రక్తం తీస్తున్నప్పుడు నొప్పి భరించలేక పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు గ్లూకోజ్‌ను నిర్ధారించడానికి ఎలక్ట్రోకెమికల్‌ పరికరాన్ని కనుగొన్నారు. దీంతో రక్తం అవసరం లేకుండా చెమటను పరీక్షించి నిమిషంలో మధుమేహాన్ని లెక్కించొచ్చు. ఈ పరికరాన్ని నిశితంగా పరీక్షించిన భారత ప్రభుత్వం పేటెంట్‌ హక్కులు ఇస్తూ ఇటీవల ధ్రువపత్రం జారీ చేసింది. సూది అవసరం లేకుండానే ఈ పరికరంతో గ్లూకోజ్ పరీక్షలు చేయవచ్చు. చిన్నారులకు, పలుమార్లు షుగర్ టెస్ట్ అవసరమైన వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డా.శ్రీనివాసరావు తెలిపారు. తాను రూపొందించిన పరికరాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పలు విధాలుగా పరీక్షించి తాజాగా పేటెంట్ హక్కులు జారీ చేసిందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరికరాన్ని రూపొందించేందుకు తాను నాలుగేళ్ల పాటు కష్టపడినట్టు ఆయన చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పూలు.. పళ్లు…రాఘవేంద్రరావు.. అప్పుడైనా.. ఇప్పుడైనా

అయోధ్య బాల రాముడి శిల్పం రూపకర్త ఎవరో తెలుసా ??

హైదరాబాద్ విమాన ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం గుడ్‌ న్యూస్‌

ఆ గ్రామంలో ఎక్కడ చూసినా నాగదేవత ప్రతిమలే

కొత్త సంవత్సరం తొలి రోజున భారతీయుల వరల్డ్‌ రికార్డ్‌