Metro Rail Track: మెట్రోరైలు ట్రాక్ మధ్యలోకి దూకిన మహిళ.. ఏం జరిగిందంటే.?
రైల్వే స్టేషన్లలో ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కి వెళ్లడానికి కొందరు పట్టాలను దాటి వెళ్తుంటారు. కొందరు ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురుగా ఏం వస్తుందో కూడా చూసుకోరు. రైల్వే అధికారు, సిబ్బంది ఎన్ని విధాలుగా అవగాహన కల్పించినా కొందరు కోరి ప్రమాదాలబారిన పడుతుంటారు. తాజాగా ఓ మహిళ మెట్రో రైలు ట్రాక్‌పైకి దూకేసింది. ట్రాక్‌పైన తన సెల్‌ఫోన్ పడిపోవడంతో దానికోసం ఆమె వెనుకా ముందూ చూసుకోకుండా ట్రాక్‌పైకి దూకేసింది.
రైల్వే స్టేషన్లలో ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కి వెళ్లడానికి కొందరు పట్టాలను దాటి వెళ్తుంటారు. కొందరు ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురుగా ఏం వస్తుందో కూడా చూసుకోరు. రైల్వే అధికారు, సిబ్బంది ఎన్ని విధాలుగా అవగాహన కల్పించినా కొందరు కోరి ప్రమాదాలబారిన పడుతుంటారు. తాజాగా ఓ మహిళ మెట్రో రైలు ట్రాక్‌పైకి దూకేసింది. ట్రాక్‌పైన తన సెల్‌ఫోన్ పడిపోవడంతో దానికోసం ఆమె వెనుకా ముందూ చూసుకోకుండా ట్రాక్‌పైకి దూకేసింది. అలా ట్రాక్‌పైకి దూకిన మహిళ 750 కేవీ విద్యుత్ ప్రవహించే ట్రాక్ మధ్యలో పడింది. మహిళ దూకడాన్ని గుర్తించిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూముకు సమాచారం అందించడంతోపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్లు 15 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్టు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ట్రాక్‌పై పడిపోయిన ఫోన్‌ను తీసుకున్న మహిళ మరో ప్రయాణికురాలి సాయంతో తిరిగి ప్లాట్‌ఫాంపైకి చేరుకుంది. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో రైళ్లు యథావిధిగా నడిచాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

