హైదరాబాద్ విమాన ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్ విమాన ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం గుడ్‌ న్యూస్‌

Phani CH

|

Updated on: Jan 03, 2024 | 12:41 PM

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. నూతన సంవత్సరం సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్థి పలికేలా సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు..విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్ పాస్‌లు, లగేజీ పాస్‌లు పొందవచ్చు. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. నూతన సంవత్సరం సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్థి పలికేలా సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు..విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్ పాస్‌లు, లగేజీ పాస్‌లు పొందవచ్చు. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో ప్రయాణికులు కారు పార్కింగ్ వద్దే స్వీయ తనిఖీ చేసుకోవచ్చు. అక్కడి కియోస్క్‌లలో తమ ప్రయాణ వివరాలు చెక్ చేసుకుని చెక్-ఇన్ కావచ్చు. ఆ తరువాత క్షణాల వ్యవధిలోనే మొబైల్‌కు బోర్డింగ్ పాస్‌లు వస్తాయి. బ్యాగేజీ ట్యాగర్లూ వచ్చేస్తాయి. అనంతరం, ప్రయాణికులు సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ వద్దకు వెళ్లి కన్వేయర్ బెల్ట్‌పై సామగ్రి పెడితే అది ప్రాసెస్ అవుతుంది. బ్యాగులకు ట్యాగులు ప్రయాణికులే వేయాల్సి ఉంటుంది. అనంతరం, ప్రయాణికులకు అధికారులు రసీదు జారీ చేశాక సంబంధిత ఎయిర్ లైన్స్‌కు ధ్రువీకరణ సందేశం వెళుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ గ్రామంలో ఎక్కడ చూసినా నాగదేవత ప్రతిమలే

కొత్త సంవత్సరం తొలి రోజున భారతీయుల వరల్డ్‌ రికార్డ్‌

ఒక్క రోజులో రూ. 460 కోట్ల లిక్కర్ తాగేశారు

Sudigali Sudheer: సైలెంట్‌గా.. ట్విస్ట్ ఇచ్చిన గాలోడు

Rakul Preet Singh: గుడ్‌ న్యూస్.. రకుల్‌ పెళ్లి.. డేట్ ఫిక్స్‌