ఆ గ్రామంలో ఎక్కడ చూసినా నాగదేవత ప్రతిమలే

ఆ గ్రామంలో ఎక్కడ చూసినా నాగదేవత ప్రతిమలే

Phani CH

|

Updated on: Jan 03, 2024 | 12:39 PM

ఒక గ్రామంలో ఒకటో.. రెండో.. విగ్రహాలు ఉంటాయి. కానీ ఆ గ్రామంలో ఎక్కడ చూసిన నాగ ప్రతిమ విగ్రహాలు దర్శమిస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో పెద్ద ఎత్తున నాగ ప్రతిమలు కనబడుతున్నాయి. భారీ వర్షాలు కురిసిన సందర్భంలో భూమిలో ఉన్న ప్రతిమలు బయటికి వస్తున్నాయి. నాగదేవత ఆకారంలో ఉన్న విగ్రహంతో పాటుగా ఐదు పడగల నాగుపాము విగ్రహాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఒక గ్రామంలో ఒకటో.. రెండో.. విగ్రహాలు ఉంటాయి. కానీ ఆ గ్రామంలో ఎక్కడ చూసిన నాగ ప్రతిమ విగ్రహాలు దర్శమిస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో పెద్ద ఎత్తున నాగ ప్రతిమలు కనబడుతున్నాయి. భారీ వర్షాలు కురిసిన సందర్భంలో భూమిలో ఉన్న ప్రతిమలు బయటికి వస్తున్నాయి. నాగదేవత ఆకారంలో ఉన్న విగ్రహంతో పాటుగా ఐదు పడగల నాగుపాము విగ్రహాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గ్రామంలోని ఒకే చోట 285 నాగప్రతిమ విగ్రహాలు బయటికి వచ్చాయి. ఈ చోట ఎక్కడ చూసినా నాగప్రతిమలు బయట పడుతుండడంతో చరిత్రకారులను ఆలోచింపజేస్తోంది. గ్రామంలో వందల సంఖ్యలో బయటపడుతున్న నాగదేవతల ప్రతిమలపై వెయ్యేండ్ల చరిత్ర కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు చరిత్రకారులు. నాగప్రతిమలు వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందినవిగా గుర్తించారు. జైనులు, బౌద్ధులు, హిందూ మతాలకి చెందినవారు పాలించిన సమయంలో నాగులపల్లికి ఒక చరిత్ర ఉందని.. అప్పటి మతాచార్యులు నాగిని విగ్రహాలు చెక్కించారని, నాగదేవతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పురావస్తు అధికారులు చెప్పుకొస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త సంవత్సరం తొలి రోజున భారతీయుల వరల్డ్‌ రికార్డ్‌

ఒక్క రోజులో రూ. 460 కోట్ల లిక్కర్ తాగేశారు

Sudigali Sudheer: సైలెంట్‌గా.. ట్విస్ట్ ఇచ్చిన గాలోడు

Rakul Preet Singh: గుడ్‌ న్యూస్.. రకుల్‌ పెళ్లి.. డేట్ ఫిక్స్‌

ఆ ఒక్కడు.. చిరు ఫిదా చేసిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్‌