Teeth Whitening: మీ పళ్లు పసుపుగా మారాయా.. ఇలా చేస్తే చిటికెలో తెల్లగా మారతాయి..
కొందరి పళ్లు బ్రష్ చేసిన తర్వాత కూడా పసుపు రంగులో ఉంటాయి. దంతాల బలహీనత కారణంగా ఇది జరుగుతుంది. చాలా మంది ఈ దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే
కొందరి పళ్లు బ్రష్ చేసిన తర్వాత కూడా పసుపు రంగులో ఉంటాయి. దంతాల బలహీనత కారణంగా ఇది జరుగుతుంది. చాలా మంది ఈ దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, నోటి పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ దంత సమస్యలన్నింటినీ ఇట్టే తొలగిస్తుంది ఓ మొక్క. అదే అకాసియా మొక్క. ఇది దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో అకాసియా మొక్క ఔషధ గుణాల భాండాగారంగా చెబుతారు. ఇది చిగుళ్ళు వాపు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇక దీనిని ఎలా ఉపయోగించాలంటే…
అకాసియా మొక్క అంటే మరేదో కాదు.. నల్లతుమ్మ చెట్టు. దీని బెరడు, గమ్, ఆకులు, గింజలు, కాయలు శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటిహిస్టామినిక్, యాంటీ హెమోస్టాటిక్ లక్షణాలతోపాటు.. విటమిన్లు, ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. నల్ల తుమ్మ చెట్టు బెరడును టూత్‌పేస్ట్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది మీ నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల దంతాల పసుపు సమస్య తొలగిపోతుంది. దంతాలలోని ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి. దంతాలు తెల్లగా మారడానికి నల్లతుమ్మ చెట్టు కాయలను కాల్చి, దాని నుండి వచ్చే బూడిదతో పళ్లను తోమినట్లయితే పళ్లు శుభ్రపడటమే కాదు.. ఇన్ఫెక్షన్ తగ్గి పళ్లు తెల్లగా మారతాయి. అలాగే ఈ చెట్టు లేత కొమ్మలను విరగొట్టి ముందు నుంచి నమిలి బ్రష్ లాగా వాడొచ్చు. ఇలా చేయడం వల్ల దంతాలు గట్టిపడతాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..