రేవతి మరణానికి కారణమైన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆ ఘటనకు సంబందించిన పలు వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు.