Teacher Protest: విద్యార్ధి ఇంటిముందు టీచర్ ధర్నా.. ఎందుకో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే..!
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి పాఠశాలకు రాక భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడని గ్రహించిన ఉపాధ్యాయుడు.. విద్యార్థి భవిష్యత్తు కోసం పరితపించిన తీరు అందరిని ఆలోచింపజేసింది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి పాఠశాలకు రాక భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడని గ్రహించిన ఉపాధ్యాయుడు.. విద్యార్థి భవిష్యత్తు కోసం పరితపించిన తీరు అందరిని ఆలోచింపజేసింది. బెజ్జంకిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అదే గ్రామానికి చెందిన జేరిపోతుల నవీన్ పదో తరగతి చదువుతున్నాడు. నవీన్ పది రోజులుగా పాఠశాలకు రావడం లేదు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసే టీచర్ బి.వి.ప్రవీణ్ రెడ్డి విద్యార్థి ఇంటికి వెళ్లి నవీన్‌ను పాఠశాలకు ఎందుకు పంపించడం లేదని తల్లిదండ్రులను అడిగారు. వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో నవీన్‌ను పాఠశాలకు పంపించేంతవరకు కదిలేది లేదని విద్యార్థి ఇంటి ముందు బైఠాయించారు. చదువుకు దూరం చేసి విద్యార్ధి భవిష్యత్తు పాడుచేయొద్దని, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. చదువుతో కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు, విద్యార్థికి వివరించారు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడ్ని ఉపాధ్యాయుడి వెంట పాఠశాలకు పంపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

