Viral Video: కొండముచ్చుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది
సాధారణంగా జూ కెళ్లిన సందర్శకులు అక్కడ ఉండే అన్ని రకాల జంతువులు, పక్షులను ఆసక్తిగా చూస్తారు. జంతువులతో ఫొటోలు దిగేందుకు ఉవ్విళ్లూరుతారు.
సాధారణంగా జూ కెళ్లిన సందర్శకులు అక్కడ ఉండే అన్ని రకాల జంతువులు, పక్షులను ఆసక్తిగా చూస్తారు. జంతువులతో ఫొటోలు దిగేందుకు ఉవ్విళ్లూరుతారు. ఈక్రమంలో ఓ యువతి కూడా జూకు వెళ్లింది. అక్కడి కొండముచ్చుల ఎన్‌క్లోజర్ దగ్గరకు వెళ్లి వాటి ఫొటోలు తీసింది. అంత వరకు బాగానే ఉంది. అయితే ఆతర్వాత మొబైల్ లో ఫొటోలు చూస్తూ ఒక చేతితో ఆ ఎన్‌క్లోజర్‌ను పలుమార్లు గట్టిగా కొట్టింది. దీంతో అక్కడున్న కొండముచ్చుకి బాగా కోపం వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని గట్టిగా లాగేసింది. దీంతో ఆ యువతి భయంతో కేకలు వేసింది. ఇది గమనించిన సమీపంలోని ఓ వ్యక్తి కొండముచ్చు బారి నుంచి ఆమెను కాపాడాడు. మొదట చేతితో కొండముచ్చును కొట్టి తరిమేందుకు ప్రయత్నించాడు. అయినా అది అమ్మాయి జుట్టును వదల్లేదు. దీంతో అతను తన టీ షర్ట్ విప్పి దానిని తరిమాడు. దీంతో ఎట్టకేలకు ఆ అమ్మాయి జట్టును వదిలేసింది కొండముచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: అద్భుతంగా స్టంట్ చేశాడు.. కానీ చిన్న పొరపాటుతో !!
గాడిదను ఎగిరెగిరి తన్నిన యజమాని.. దెబ్బకు సీన్ రివర్స్.. కర్మఫలం అంటే ఇదే తమ్ముడూ అంటున్న నెటిజెన్స్
Viral: రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయింది ఈ పక్షి !!
Viral Video: అమాంతం బైక్ తో సహా కారును గుద్దేశాడు.. క్షణాల్లో గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు