kakatiya university: మొన్న ఎలుకలు..ఇవాళ పాములు.. యూనివర్సిటీలో జంతు సంచారం.
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయలంలో నాగుపాములకు కేరాఫ్‌గా మారింది. హాస్టల్ పరిసరాల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తుంటే ఆ ఎలకల కోసం పాములు యూనివర్శిటీలో చొరబడుతున్నాయి. దాంతో విద్యార్ధులు భయంతో పరుగులు పెడుతున్నారు. ఇటీవల హాస్టల్ గదిలో విద్యార్థులను ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటన మరువకముందే పాముల స్వైర విహారం విద్యార్ధులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది.
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయలంలో నాగుపాములకు కేరాఫ్‌గా మారింది. హాస్టల్ పరిసరాల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తుంటే ఆ ఎలకల కోసం పాములు యూనివర్శిటీలో చొరబడుతున్నాయి. దాంతో విద్యార్ధులు భయంతో పరుగులు పెడుతున్నారు. ఇటీవల హాస్టల్ గదిలో విద్యార్థులను ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటన మరువకముందే పాముల స్వైర విహారం విద్యార్ధులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా యూరివర్శిటీలోని మానవీయ శాస్త్ర విభాగం పార్కింగ్ కేంద్రం వద్ద త్రాచుపాము ప్రత్యక్షమైంది. పార్కింగ్ సెంటర్లో రేకుల వద్ద తాచుపాము బుసలు కొడుతుండగా ఉద్యోగులు, విద్యార్ధులు గమనించి పరుగులు పెట్టారు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు సిబ్బంది.
వెంటనే స్పాట్‌కు చేరుకున్న స్నేక్స్ క్యాచర్ ఆ పామును పట్టి ధర్మసాగర్ ప్రాంతంలోని పార్కులో పామును వదిలేశారు. దీంతో విద్యార్థులు ఉద్యోగులు యూనివర్సిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేయూ క్యాంపస్ లో పరిసరాల్లో చెట్లు ముళ్లపొదలు ఎక్కువగా ఉండడం, ఆహారపు వ్యర్ధాలు, చెత్త ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పడేయడం, పుట్టలు ఎక్కువగా ఉండడం వల్లే పాములు వస్తున్నాయని స్నేక్స్ క్యాచర్స్ అంటున్నారు. పరిశసరాలు శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలుకలు చేరడం, వాటికోసం ఇలా పాములు చొరబడుతుంటాయని చెబుతున్నారు. యూనివర్శిటీ పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

