Godavari Floods: కృష్ణమ్మ శాంతించింది.. ఇప్పుడు గోదావరి వంతు.! ప్రమాద హెచ్చరికను మించి..

Godavari Floods: కృష్ణమ్మ శాంతించింది.. ఇప్పుడు గోదావరి వంతు.! ప్రమాద హెచ్చరికను మించి..

Anil kumar poka

|

Updated on: Sep 09, 2024 | 12:19 PM

కృష్ణమ్మ అయిపోయింది.. ఇప్పుడ గోదావరి వంతు వచ్చింది. కొద్ది రోజులుగా ధాటిగా ఉన్న కృష్ణమ్మ ప్రవాహం కాస్త తగ్గింది. ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే అటు గోదావరిలో మాత్రం నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది.

కృష్ణమ్మ అయిపోయింది.. ఇప్పుడ గోదావరి వంతు వచ్చింది. కొద్ది రోజులుగా ధాటిగా ఉన్న కృష్ణమ్మ ప్రవాహం కాస్త తగ్గింది. ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే అటు గోదావరిలో మాత్రం నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర ప్రస్తుతం నీటి మట్టం 12.3 అడుగులకు చేరింది. ఇక్కడి నుంచి సముద్రంలోకి 175 గేట్ల నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరీవాహక, లంక గ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్‌ సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 09, 2024 11:29 AM