రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సోదరి వీడియో
దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుక వేళ తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఓ సోదరి 14 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. 14 ఏళ్లుగా పాకిస్తాన్ జైల్లో మగ్గిపోతున్న తన సోదరుడు తిరిగొచ్చే వరకు ఎవరికీ రాఖీ కట్టకుండా అతడి కోసం ఎదురు చూస్తుంటానని మొండిపట్టు పట్టింది.
అసలేమైందంటే.. మధ్యప్రదేశ్ బీఫార్మసీ స్టూడెంట్ ప్రసన్నజిత్ కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ తెలియక ఏదైనా ప్రమాదంలో చనిపోయి ఉంటాడని కుటుంబం భావించింది. అయితే 2021లో పాక్ జైలు నుంచి విడుదలైన ఓ భారత ఖైదీ ప్రసన్నజిత్ కుటుంబాన్ని కలిసి ప్రసన్నజిత్ మరణించలేదని.. 2019 నుంచి పాక్ జైలులో ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుతం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్న అతడి పేరును కూడా అక్కడి అధికారులు మార్చేశారని తెలిపాడు. ప్రసన్నజిత్ పాక్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా.. అధికారులు అరెస్ట్ చేసారు. నాటి నుంచి తన సోదరుడిని విడిపించాలని కోరుతూ అతని సోదరి సంఘమిత్ర విదేశాంగ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. కొద్దికాలం కిందట తమ తండ్రి చనిసోయాడని..తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి కారణంగా పోస్టల్ సేవలు నిలిచిపోవడంతో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. భారత్ నుంచి ప్రేమతో పంపిన రాఖీని పాక్ అధికారులు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్న తన సోదరుడికి అందజేయాలని కోరింది.
మరిన్ని వీడియోల కోసం :
ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో
21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?
అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
