పసివాడి ప్రాణాన్ని కాపాడిన పెంపుడు కుక్క వీడియో
ఓ వీధిలో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడికి సమీపంలో ఉన్న ఓ ఇంటి అరుగుమీద జర్మన్ షెపర్డ్ పెంపుడు శునకం కూర్చుని ఉంది. అదే ఇంట్లోంచి ఓ బాలుడు బయటికి వచ్చి.. వీధిలోని పిల్లలతో కలిసి ఆడుకునేందుకు పరిగెట్టి పోతున్నాడు. అయితే.. అదే సమయంలో ఓ వీధికుక్క బాలుడి మీదికి దూసుకొచ్చింది. అది చూసి ఆ బాలుడు భయంతో అరుస్తూ పరిగెత్తటం ప్రారంభించాడు.
ఓ వీధిలో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడికి సమీపంలో ఉన్న ఓ ఇంటి అరుగుమీద జర్మన్ షెపర్డ్ పెంపుడు శునకం కూర్చుని ఉంది. అదే ఇంట్లోంచి ఓ బాలుడు బయటికి వచ్చి.. వీధిలోని పిల్లలతో కలిసి ఆడుకునేందుకు పరిగెట్టి పోతున్నాడు. అయితే.. అదే సమయంలో ఓ వీధికుక్క బాలుడి మీదికి దూసుకొచ్చింది. అది చూసి ఆ బాలుడు భయంతో అరుస్తూ పరిగెత్తటం ప్రారంభించాడు. వెంటనే ఆ బాలుడి అరుపు విన్న జర్మన్ షెపర్డ్ కుక్క.. క్షణంలో అక్కడికి దూసుకొచ్చు.. ఆ వీధికుక్క మీద దాడి చేసింది. దీంతో బిత్తరపోయిన ఆ వీధికుక్క భయంతో అక్కడినుంచి పరారైంది. దీంతో ఆ బాలుడితో బాటు అక్కడ ఆడుకుంటున్న పిల్లలంతా ప్రమాదం నుంచి బయటపడినట్లయింది. అయితే,ఈ సీన్ అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అందులో.. జర్మన్ షెపర్డ్ ఎంట్రీ ఒక యాక్షన్ సినిమా సీన్‌లా కనిపించింది. ఆ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలోని నెటిజన్లు ఆ కుక్కను తమదైన శైలిలో ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. వీడియోపై తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. కుక్కలు చాలా విశ్వాసం కలవి… సమయం వచ్చినప్పుడు అవి ప్రాణాలను కాపాడతాయి అంటూ కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో
21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?
అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
