వాట్సాప్ గ్రూప్ పేరు మారిందా?! మీ ఫోన్ హ్యాక్ అయినట్లే వీడియో
ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. వాట్సప్‌లో తమ బంధువులు, స్నేహితులు ఉద్యోగులు, ఆఫీసులకు సంబంధించి పలు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని రోజూ ఆ గ్రూపుల ద్వారా చర్చించుకుంటుంటారు. కొందరు ఒకటి రెండుకన్నా ఎక్కువ గ్రూపుల్లో మెంబర్లుగా ఉంటున్నారు. అయితే.. ఇటీవల ఆయా గ్రూప్ పేర్లు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఎవరూ మార్చకుండానే ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా మారిపోతోంది. ఇలా మీ వాట్సప్ గ్రూప్ మారిపోయిందంటే మీ గ్రూప్ హ్యాక్ అయినట్లే.
ఇటీవల బంధువులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక వాట్సాప్ గ్రూప్ పేరు అకస్మాత్తుగా ‘యోనో ఎస్‌బీఐ’ లోగోతో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా మారిపోయింది. అందులోని ఒక సభ్యుడి పేరుతో ‘యోనో ఎస్‌బీఐ పాన్ అప్‌డేట్.ఏపీకే’ పేరుతో ఒక లింక్ వచ్చింది. వెంటనే ఒక సభ్యుడు అప్రమత్తం అయ్యారు. అది వైరస్ ఫైల్ అని, ఎవరూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. దాన్ని ఎవరూ క్లిక్ చేయకపోవటంతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా వారు తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే…గ్రూప్‌లోని ఒక సభ్యుడు తనకు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేశారు. అది వైరస్ ఫైల్ కావడంతో అతని ఫోన్ హ్యాక్ అయింది. హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ‘యోనో ఎస్‌బీఐ పాన్ అప్‌డేట్’ పేరుతో వైరస్ ఏపీకే ఫైల్‌ను తయారు చేసి ఆ గ్రూప్ సభ్యుడి ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్లన్నింటికీ వారే పంపించేశారు. అంతేకాదు.. అతను ఉన్న ఇతర వాట్సాప్ గ్రూప్‌లన్నింటిలోకి అతని పేరుతో ‘యోనో ఎస్‌బీఐ పాన్ అప్‌డేట్.ఏపీకే’ వైరస్ ఫైల్ వెళ్లిపోయింది. కనుక.. వాట్సాప్ గ్రూప్‌లలో సభ్యులుగా ఉన్నవారంతా ఇలాంటి సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గ్రూప్‌లోని సభ్యుల పేరుతో ‘ఏపీకే’ ఫైల్ వచ్చినా.. దాన్ని క్లిక్ చేయవద్దని, ఒకవేళ ఎవరైనా తెలియక క్లిక్ చేస్తే.. క్షణాల వ్యవధిలో సదరు వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసి, వెంటనే ఫోన్ ఫార్మాట్ చేయాలని సూచించారు. కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌లో మీ బ్యాంకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు మార్చేసుకోవాలి. ఖాతాల నుంచి డబ్బులు పోతే వెంటనే సైబర్ క్రైం పోర్టల్ 1930కు ఫిర్యాదు చేయాలి. గంటలోపు ఫిర్యాదు చేస్తే.. పోయిన డబ్బును వెనక్కి తీసుకువచ్చే ఛాన్స్ ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో
21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?
అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
