పాపం ఫుడ్ డెలివరీ బోయ్‌కి ఎంత కష్టం వచ్చిందో.. బైక్‌తో సహా డ్రైనేజీలో వీడియో
హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. చాలా చోట్ల ఎక్కడికక్కడ రోడ్లపై వరద నీరు నిలిచిపోగా, డ్రైనేజీలు ఉప్పొంగాయి. అయితే.. ఇంత వానలోనూ ఫుడ్ డెలివరీ బాయ్స్ మాత్రం తమ వాహనాల మీద.. 24 గంటలూ కస్టమర్ల సేవలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ..మార్గమధ్యంలో బైక్‌తో సహా డ్రైనేజీలో పడిపోయాడు.
హైదరాబాద్ అభివృద్ధి గురించి ఎంత గొప్ప చెప్పుకున్నా.. అక్కడక్కడా ఇలాంటి విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం కురిసిన వర్షానికి.. ఎల్బీనగర్ పరిధిలోని టీకేఆర్ కమాన్ వద్ద రోడ్లు నీటితో నిండిపోయాయి. ఎక్కడ డ్రైనేజీ ఉందో కూడా గుర్తించడం కష్టంగా మారింది. ఇంతలో అటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్.. బైక్‌తో సహా డ్రైనేజీలో పడిపోయాడు. ఈ ఘటనలో బైక్ కొట్టుకుపోగా, మొబైల్ ఫోన్ కూడా నీటిలో గల్లంతైంది. కాగా, అటుగా పోతున్న వాహనదాదారులు.. అతడిని చూసి వెంటనే తాళ్ల సాయంతో అతడిని బయటికి తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతా కష్టం పడితే.. పాపం ఆ ఫుడ్ డెలవరీ బాయ్‌కి రెయిన్‌సర్జ్ కింద వచ్చేది కేవలం రూ.10 అని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా,ఈ ఘటనపై బాధిత డెలివరీ మాట్లాడుతూ.. తాను దాదాపు 6 ఏళ్ల నుంచి డెలివరీ బాయ్‌గా చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో తన ఫోన్ పోయిందని, బైక్ పాడైపోయిందన్నారు. అది కొత్త బైక్ అని, దాని ఈఎంఐలు కూడా కడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌పైనే ఆధారపడి జీవిస్తున్నానని, ఈ మేరకు తనకు సాయం చేయాలని బాధితుడు కోరారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో
21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?
అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
