AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండచిలువకు చిక్కిన కోతి.. వానర సైన్యం ఏం చేసిందంటే ??

కొండచిలువకు చిక్కిన కోతి.. వానర సైన్యం ఏం చేసిందంటే ??

Phani CH
|

Updated on: Nov 08, 2022 | 3:11 PM

Share

సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడంటే అతనికి సాయం చేయడానికి ఎంతగానో ఆలోచిస్తారు మానవులు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలాంటి ఓ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది.

సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడంటే అతనికి సాయం చేయడానికి ఎంతగానో ఆలోచిస్తారు మానవులు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలాంటి ఓ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. తమ తోటి జంతువు ప్రమాదంలో పడటంతో దాన్ని రక్షించుకునేందుకు మిగతా మూగజీవులు చేసిన పోరాటం నెటిజన్లను ఆలోచింపచేస్తుంది. ఒక కోతి కొండ చిలువకు చిక్కింది. దాని నుంచి తప్పించుకోవడానికి ఆ కోతి ఎంతగానో ప్రయత్నించింది. అది గమనించిన తోటి వానరాలు తమ స్నేహితుడు కళ్లముందే మరో జీవికి ఆహారమైపోతుండటం చూసి తట్టుకోలేకపోయాయి. దాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని శతవిధాలా ప్రయత్నించాయి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తోటి ప్రాణిని కాపాడుకునే ప్రయత్నం చేసాయి. ఈ క్రమంలో ఆ కొండచిలువ వానర సైన్యంపై ఎదురుదాడికి దిగుతూ వాటిని సైతం కబళించేందుకు యత్నించింది. అయినా అవి బయపడకుండా తమ తోటి జీవిని కాపాడుకునేందుకు దానితో పోరాడుతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షించారు. వందల్లో లైక్‌ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఐకమత్యంగా పోరాడాలని ఈ వానరసైన్యం మరోసారి చాటిచెప్పిందంటూ అభిప్రాపడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో దూరిన కాకి.. చివరికి ??

ఈ టెకీ కాన్ఫిడెన్స్‌కి హ్యాట్సాఫ్‌.. ట్విట్టర్‌ మాజీ ఎంప్లాయ్‌ పోస్ట్‌కు నెటిజ‌న్లు ఫిదా

కరోనా మహమ్మారి పెట్టిన పరీక్ష.. క్యాబ్ డ్రైవర్‌గా మారిన మహిళ !! పట్టుదలకు నెట్టింట ప్రశంసలు

హన్సిక పెళ్లికి ముందే.. కాబోయే భర్త భండారం బట్టబయలు

Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్

 

Published on: Nov 07, 2022 09:22 PM