కరోనా మహమ్మారి పెట్టిన పరీక్ష.. క్యాబ్ డ్రైవర్‌గా మారిన మహిళ !! పట్టుదలకు నెట్టింట ప్రశంసలు
కరోనా మహమ్మారి కారణంగా ఓ మంచి వ్యాపారవేత్త కావలసిన మహిళ క్యాబ్ డ్రైవర్‌గా మారింది. తాను సొంతంగా బిజినెస్ చేస్తూ మరికొందరికి ఉపాధి కల్పించాలనుకుంది.
కరోనా మహమ్మారి కారణంగా ఓ మంచి వ్యాపారవేత్త కావలసిన మహిళ క్యాబ్ డ్రైవర్‌గా మారింది. తాను సొంతంగా బిజినెస్ చేస్తూ మరికొందరికి ఉపాధి కల్పించాలనుకుంది. ఫుడ్ బిజనెస్ ప్రారంభించింది. కాలం కరోనా రూపంలో అడ్డుపడింది. వ్యాపారం దెబ్బతిని తీవ్రంగా నష్టపోయింది. తిరిగి వ్యాపారం ప్రారంభించడానికి డబ్బు లేదు. సాయం చేసేవారూ లేరు. అయినా ధైర్యం కోల్పోలేదు. కుటుంబ పోషణ కోసం డ్రైవర్‌గా మారింది. రోజూ 12 గంటలు పనిచేస్తుంది. తన జీవితాన్ని మళ్ళీ పునర్మించుకోవడం కోసం కృషి చేస్తోంది. తనకొక పాప కూడా ఉంది. ఆ పాపను ఫ్రంట్ సీట్‌లో పడుకోబెట్టి తను తన విధులను నిర్వహిస్తోంది. ఎందుకంటే బేబీ సిట్టింగ్ సెంటర్ సెలవు వున్న ప్రతిసారీ ఆ చిన్నారిని తనతోపాటే తీసుకువెళ్తుంది. అటు తల్లిగా బిడ్డ రక్షణ చూసుకుంటూ తన కలల సామ్రాజ్యాన్ని స్థాపించుకునే దిశగా ముందుకు సాగుతున్న బెంగళూరుకు చెందిన నందిని అనే ఈ మహిళ ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు. ఈ ఇన్‌స్పైరింగ్ స్టోరీని రాహుల్ శశి అనే వ్యక్తి లింక్డ్ ఇన్ లో పంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హన్సిక పెళ్లికి ముందే.. కాబోయే భర్త భండారం బట్టబయలు
Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్
ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

