Polar Bear: ఈ ఎలుగుబంటి తెలివికి హ్యాట్సాఫ్‌ !! నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో

Polar Bear: ఈ ఎలుగుబంటి తెలివికి హ్యాట్సాఫ్‌ !! నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో

Phani CH

|

Updated on: Oct 23, 2022 | 9:36 AM

మనుషులు పాఠశాలకు వెళ్లో, కళాశాలలోనో విద్యనభ్యసించడం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. కొన్ని విషయాలు తల్లిదండ్రులో, నిపుణులో చెబితే తెలుసుకుంటారు.

మనుషులు పాఠశాలకు వెళ్లో, కళాశాలలోనో విద్యనభ్యసించడం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. కొన్ని విషయాలు తల్లిదండ్రులో, నిపుణులో చెబితే తెలుసుకుంటారు. మరి వన్యమృగాలకు జీవిత పాఠాలను ఎవరు నేర్పిస్తారు. ప్రకృతే వాటికి పాఠశాల. అవి ప్రకృతిలో నిరంతరం జరిగే ప్రక్రియను గమనిస్తూ అనేక పాఠాలు నేర్చుకుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియో ఒక ధ్రువపు ఎలుగుబంటికి సంబంధించినది. ఇవి సాధారణంగా మంచుప్రాంతాల్లో కనిపిస్తాయి. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ తెల్లని ధ్రువపు ఎలుగుబంటి మంచుతో గడ్డకట్టిన ఒక చిన్న నీటి ప్రవాహాన్ని దాటడానికి ఎంతో తెలివిగా వ్యవహరించింది. అది నేరుగా గడ్డకట్టిన నీటిపై నడిస్తే పగిలిపోయి అందులో పడిపోయే ప్రమాదముందని, తెలివిగా దానిపైన పడుకొని జారుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోని ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ధ్రువపు ఎలుగుబంటి నేర్పుతున్న జీవితపాఠం అంటూ ఆమె దీనికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఈ ఎలుగు తెలివితేటలకు ముచ్చటపడిపోతుంటే.. మరికొందరు ఇదేదో సైంటిస్ట్ ఎలుగుబంటిలా ఉందంటూ జోకులు వేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shruti Haasan: హలీవుడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్‌ శ్రుతి !!

Jr NTR: జపాన్ భాషలో స్పీచ్ అదరగొట్టిన తారక్

RRR in Japan: భార్యలతో జపాన్ రోడ్లపై చరణ్, తారక్‌ హంగామా

బౌండరీలతో అదరగొడుతున్న ఆరో తరగతి అమ్మాయి.. చిన్నారి బ్యాటింగ్‌ కు నెటిజన్లు ఫిదా

Published on: Oct 23, 2022 09:36 AM