Viral Video: తమ కంటే బలవంతులతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మరి.. నవ్వులు పూయిస్తోన్న పిల్లి, చిలుక వీడియో.
Cat Parrot Fight: బలవంతులకు బలహీనులు భయపడడం సర్వసాధారణమైన విషయం. ఇది సృష్టి ధర్మం.. దీనిని ఎవరూ కాదనేలరు. అయితే మనుషుల్లో మాత్రం ఇలాంటి...
Cat Parrot Fight: బలవంతులకు బలహీనులు భయపడడం సర్వసాధారణమైన విషయం. ఇది సృష్టి ధర్మం.. దీనిని ఎవరూ కాదనేలరు. అయితే మనుషుల్లో మాత్రం ఇలాంటి అసమానతలను తగ్గించడానికి బలహీనులకు చట్టం, న్యాయం సపోర్ట్‌గా ఉంటాయి. అయితే జంతువుల్లో ఇలాంటివేం ఉండవు కదా.! కాబట్టి బలహీనమైన జీవులు తమకంటే బలమైన వాటికి భయపడతాయి. అలా కాకుండా బలం లేకపోయినా మొండిగా ముందుకు వెళితే ఈ చిలుకకు జరిగినట్లే జరుగుతుంది.
ఇంతకీ విషయం ఏంటనేగా.? ఓ చిలుక, పిల్లిల మధ్య జరిగిన సరదా సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ చిలుక తన కంటే పెద్దదైన పిల్లిని భయపెడుతూ ముందుకు వెళ్లింది. అయితే ఆ పిల్లి కూడా భయపడుతున్నట్లే కాసేపు నటించింది. చిలుక మీదమీదకు వెళ్తుంటే పిల్లి భయపడుతూ వెనక్కి వెళ్లి గోడకు నక్కింది. అయితే ఓపిక నశించేదేమో కానీ.. ఇక చాలు అన్నట్లు ఒక్కసారిగా చిలుకపై పంజాతో కొట్టింది. దీంతో చిలుక తుర్రుమని పారిపోయింది. అయితే చిలుకకు భయపడుతూ పిల్లి నక్కిన సీన్ మాత్రం నవ్వు తెప్పిస్తోంది. మరి మీరూ ఓసారి ఆ వీడియోను చూసేయండి..
Please help me … I’m being attacked by a dragon ?. pic.twitter.com/PWs41VP1ea
— Cute Animals™ (@ItsAnimalsWorld) July 14, 2021
Also Read: సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో విజయ్ సేతుపతి.. రాక్షసుడు సీక్వెల్ కోసం రంగంలోకి మక్కల్ సెల్వన్..?
Parasuram: అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన పరశురామ్.. విజిల్స్ పక్కా అంట..
తగ్గేదే లే అంటున్న ఆహా… మరో ఇంట్రస్టింగ్ మూవీతో రానున్న తెలుగు ఓటీటీ ఫ్లాట్ఫామ్ ..