VIRAL VIDEO : హెలికాప్టర్‌లో వరుడు వస్తుంటే.. కరెన్సీ నోట్లతో స్వాగతాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..

|

Mar 16, 2021 | 3:57 PM

Pakistan Takes Wedding To Next Level : పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే పేద, ధనిక తేడా లేకుండా తమకు ఉన్నంతలో ఘనంగా నిర్వహిస్తారు. అందుకోసం ముందుగానే

VIRAL VIDEO : హెలికాప్టర్‌లో వరుడు వస్తుంటే.. కరెన్సీ నోట్లతో స్వాగతాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..
Pakistan Takes Wedding To N
Follow us on

Pakistan Takes Wedding To Next Level : పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే పేద, ధనిక తేడా లేకుండా తమకు ఉన్నంతలో ఘనంగా నిర్వహిస్తారు. అందుకోసం ముందుగానే ప్లాన్ చేసుకొని బడ్జెట్ వేసుకొని చాలా పకడ్బందీగా ఉంటారు. వచ్చిన అతిథులకు, చుట్టాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ పెళ్లిని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకునే విధంగా నిర్వహిస్తారు. పెళ్లి గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలని ప్రతిఒక్కరూ భావిస్తారు. అందుకోసం వారి బడ్జెట్‌కు మించి ఖర్చు చేస్తారు. ఇదంతా ఎందుకు ప్రస్తావించానంటే పాకిస్తాన్‌లో జరిగిన ఓ పెళ్లి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ పెళ్లి తతంగం వైరల్‌గా మారింది.

అసలు విషయమేమిటంటే.. పాకిస్థాన్‌లోని మండి బహవుద్దీన్ సిటీలో జరిగిన పెళ్లి వేడుకలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి కోసం వరుడు హర్రాయ గ్రామం నుంచి మండి బహవుద్దీన్‌కు రావాల్సి ఉండగా, అతడు హెలికాప్టర్‌లో రావడం విశేషం. మ్యారేజ్ ఫంక్షన్ హాల్‌కు దగ్గరలోని ఫాలియా రోడ్‌పై ఈ హెలికాప్టర్ ల్యాండ్ కాగా, ఆయన రాకను పురస్కరించుకుని వరుడి సోదరులు గాలిలో కరెన్సీ నోట్లను ఎగిరేశారు. ఈ తతంగాన్ని చూసిన అతిథులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. కరెన్సీ నోట్లు ఎగురుతున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో పెళ్లిళ్లు చూసాం కానీ కరెన్సీ నోట్ల పెళ్లి ఇప్పటి వరకు చూడలేదని అందరు నోరెళ్ల బెడుతున్నారు.

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇంటి దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేసిన వ్యక్తి గుర్తింపు

‘మా వ్యాక్సిన్ తీసుకోండి, వీసాలిస్తాం’, చైనా కొత్త ప్రకటన, ‘ తాయిలం’ ఫలించేనా ? ఇండియాతో పోటీయా ?

మూడో టీ20: టీమిండియాలో కీలక మార్పు.. తుది జట్టులోకి రోహిత్ శర్మ.. ఆ స్టార్ ప్లేయర్‎పై వేటు.!