Operation Bhediya: కనిపిస్తే కాల్చి పడేయండి.! ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తున్న తోడేళ్లు..
ఉత్తరప్రదేశ్ లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా మహసి ప్రాంతంలోని ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ‘ఆపరేషన్ భేడియా’ చేపట్టారు. అయినా జంతువుల దాడులు మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కన్పిస్తే కాల్చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా మహసి ప్రాంతంలోని ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ‘ఆపరేషన్ భేడియా’ చేపట్టారు. అయినా జంతువుల దాడులు మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కన్పిస్తే కాల్చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. మొత్తం ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీశాఖ అధికారులు.. ఆపరేషన్ భేడియా లో భాగంగా ఇప్పటివరకు నాలుగింటిని పట్టుకున్నారు. మిగతా రెండింటిని బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం చిక్కట్లేదు. మరోవైపు.. తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం రాత్రి కూడా ఓ ఐదేళ్ల పాపపై దాడి చేసి గాయపర్చింది. ఇప్పటివరకు తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా.. దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ఇందులో ‘అపరేషన్ భేడియా’పై అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. తోడేళ్లు ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చుతుండటంతో పట్టుకోవడం సవాల్‌గా మారుతోందని వివరించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్లను పట్టుకోవడం అసాధ్యమైన తరుణంలో వాటిని కాల్చేయాలని ఆదేశించారు. అయితే, అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని పేర్కొన్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. ప్రతి నాలుగైదు రోజులకొకసారి తోడేళ్లు కొత్త గ్రామంపై దాడి చేస్తున్నాయని, దీంతో వాటి దాడులను అంచనా వేయడం సవాలుగా మారుతోందని బహరాయిచ్ జిల్లా కలెక్టర్ రాణి తెలిపారు. పరిస్థితిపై ఇప్పటికే ప్రజలకు సమాచారమిచ్చాం. రాత్రివేళల్లో తలుపులన్నీ మూసివేసి ఇంట్లోనే నిద్రపోవాలని సూచించాం. డ్రోన్లతో తోడేళ్ల కదలికలను తెలుసుకుంటున్నామని వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.