Trees Collapsed: ఒకేసారి నేల కూలిన 50వేలకుపైగా మహా వృక్షాలు.! మేడారంలో వింత ఘటన..
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం – మేడారంలోని అడవుల్లో, విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆడవి తల్లి వణికిపోయింది. రాత్రికి రాత్రి 50,000 పైగా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన తాడిచెర్ల, తామిడేరు ప్రాంతాల మధ్య జరిగింది. ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మేడారం అడవుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం – మేడారంలోని అడవుల్లో, విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆడవి తల్లి వణికిపోయింది. రాత్రికి రాత్రి 50,000 పైగా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన తాడిచెర్ల, తామిడేరు ప్రాంతాల మధ్య జరిగింది. ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మేడారం అడవుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. పెద్ద ఎత్తున చెలరేగిన గాలి దుమరానికి మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50వేలకు పైగా వృక్షాలు నేల కూలాయి. ఇదంతా వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణం అంటున్నారు నిపుణులు. ఇదంతా టోర్నడోలు వల్ల జరిగి ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు.
సాధారణంగా, టోర్నడోలు, ఒక స్పష్టమైన మార్గంలో సాగే గాలుల ధాటికి చెట్లు కూలిపోతాయి. ఈ టోర్నడోలు టెక్నికల్‌గా అనేక కారకాల వల్ల ఏర్పడతాయనీ, వీటిలో అధిక వేగంతో కూడిన గాలులు, అవీ సంభవించే మార్గంలో అనేక చెట్లు కూలిపోవడం ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఈ సంఘటన వల్ల పాత చెట్లపై ఎక్కువ ప్రభావం చూపిందని వారు చెప్పారు. వాతావరణ శాఖ, అటవీశాఖ ఈ సంఘటనను మరింత వివరంగా పరిశీలించేందుకు, శాటిలైట్ డేటా తోపాటు ఇతర పరికరాలను ఉపయోగించి ఈ ప్రాంతంలో మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 2 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న దాదాపు 50 వేల చెట్లు ఒకే మార్గంలో కూలడం పట్ల వాతావరణ శాఖ తోపాటు అటవీశాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.