MP Horror: దారుణం.. మద్యం మత్తులో వ్యక్తిని రోడ్డుపై 25 కి.మీ ఈడ్చుకెళ్లి.. వీడియో.
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో దారుణం జరిగింది. బంధువైన వ్యక్తిని కొందరు మద్యం మత్తులో కారు నుంచి బయటకు తోసేశారు. సుమారు 25 కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో అతడు మరణించాడు. ఇతర వాహనదారులు గమనించి కారు ఆపాలని డ్రైవర్‌కు సిగ్నల్ ఇచ్చారు. మరికొందరు తమ వాహనాల్లో వారిని అనుసరించారు. భోపాల్‌లోని అవధ్‌పురి ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల సందీప్ నక్వాల్, బంధువులైన సంజీవ్ నక్వాల్, రాజేష్ చాదర్‌తో కలిసి కారులో ప్రయాణించాడు.
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో దారుణం జరిగింది. బంధువైన వ్యక్తిని కొందరు మద్యం మత్తులో కారు నుంచి బయటకు తోసేశారు. సుమారు 25 కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో అతడు మరణించాడు. ఇతర వాహనదారులు గమనించి కారు ఆపాలని డ్రైవర్‌కు సిగ్నల్ ఇచ్చారు. మరికొందరు తమ వాహనాల్లో వారిని అనుసరించారు. భోపాల్‌లోని అవధ్‌పురి ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల సందీప్ నక్వాల్, బంధువులైన సంజీవ్ నక్వాల్, రాజేష్ చాదర్‌తో కలిసి కారులో ప్రయాణించాడు. ఆ ముగ్గురు రాజస్థాన్‌లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున సీహోర్ వద్ద కారు ఆపి ఫుడ్, మద్యం కొనుగోలు చేశారు. అనంతరం కారు వెనుక సీటులో కూర్చొన్న సందీప్, సంజీవ్ మధ్య ఒక అంశంపై వాగ్వాదం జరిగింది. దీంతో సంజీవ్ ఆగ్రహంతో సందీప్‌ను కారు నుంచి బయటకు తోశాడు. కాగా, సీట్ బెల్ట్ పెట్టుకున్న సందీప్ పూర్తిగా రోడ్డుపై పడలేదు. కారు నుంచి వేలాడిన అతడ్ని 25 కిలోమీటర్ల దూరం వరకు ఆ వాహనంతో ఈడ్చుకెళ్లారు. ఇతర వాహనదారులు గమనించి కారు ఆపాలని డ్రైవర్‌కు సిగ్నల్ ఇచ్చారు. అయినా డ్రైవర్ కారును ఆపకపోవడంతో మరికొందరు తమ వాహనాల్లో దానిని అనుసరించారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారు. టోల్ ప్లాజా వద్ద ఆగిన కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కారు నుంచి ఈడ్చడంతో తీవ్రంగా గాయపడిన సందీప్ మరణించినట్లు తెలుసుకున్నారు. దీనికి ముందు సందీప్ భార్య ఫోన్ చేయడంతో కారులో జరిగిన సంభాషణను ఆమె విన్నది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

