Tamil Nadu: డ్రోన్ విజువల్స్‌.. చెన్నైలో ఎటు చూసినా నీరు.! ఆకాశం నుంచి చూస్తే..

Tamil Nadu: డ్రోన్ విజువల్స్‌.. చెన్నైలో ఎటు చూసినా నీరు.! ఆకాశం నుంచి చూస్తే..

Anil kumar poka

|

Updated on: Dec 08, 2023 | 6:42 PM

తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్‌ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్‌ వేలాది ఎకరాల్లో పంట నాశనం చేసింది. అటు రాయలసీమలో, ఇటు తెలంగాణలో తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 96.8 మి.మీ వర్షం కురిసింది. బుధవారం కూడా తెలంగాణలో కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో, అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి అధికారులను కోరారు.

తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్‌ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్‌ వేలాది ఎకరాల్లో పంట నాశనం చేసింది. అటు రాయలసీమలో, ఇటు తెలంగాణలో తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 96.8 మి.మీ వర్షం కురిసింది. బుధవారం కూడా తెలంగాణలో కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో, అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. రిలీఫ్ ఫండ్ కింద తక్షణమే రూ. 5 వేల కోట్లను ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు.

కాగా చెన్నై నగరంలో పరిస్థితిని డ్రోన్ విజువల్స్‌ కళ్లకు కట్టాయి. మిచౌంగ్ తుపాను తమిళనాడును కుదిపేసింది. చెన్నై నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులా మారాయి. కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. రెండు రోజులుగా నిత్యావసరాలు అందక ప్రజలు అలమటిస్తున్నారు. భారత వాయుసేనకు చెందిన చేతక్‌ హెలికాప్టర్లు ఆహార పొట్లాలను జారవిడిచాయి. మంగళవారం చెన్నై నగరంలో వర్షం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాల ధాటికి చెన్నై నగరంలో ఇప్పటికే 12 మంది చనిపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.