Apple iPhone: దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ. ఎందుకంటే.? కారణం చెప్పిన ఫాక్స్‌కాన్.
యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది.
యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో ఐఫోన్ల తయారీ తాత్కాలికంగా నిలిచిపోయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. చైనా నుంచి ఐఫోన్ తయారీని మార్చాలనే క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 35,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన రెండో త్రైమాసికంలో 25 లక్షల యూనిట్లను తయారుచేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్నుంచి బయటకు తీస్తుండగా..

