Bird Viral: పిల్లలకోసం తల్లిపక్షి తపన..! పక్షి సాహసానికి నెటిజన్లు ఫిదా.. హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

Bird Viral: పిల్లలకోసం తల్లిపక్షి తపన..! పక్షి సాహసానికి నెటిజన్లు ఫిదా.. హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

Anil kumar poka

|

Updated on: Apr 24, 2022 | 9:38 AM

తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు. బిడ్డ గర్భంలోఉన్నప్పటినుంచే ఆ బిడ్డ క్షేమం కోసం ఎంతో పరితపిస్తుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది.


తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు. బిడ్డ గర్భంలోఉన్నప్పటినుంచే ఆ బిడ్డ క్షేమం కోసం ఎంతో పరితపిస్తుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు.. పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. అందుకు ఈ వీడియోనే నిదర్శనం.సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పక్షి తన గుడ్లను కాపాడుకోడానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టింది. ఇందులో ఓ ప్రదేశంలో పెద్దమొత్తంలో మట్టి దిబ్బగా ఏర్పడి ఉంది. దానిపైన ఓ పక్షి గుడ్లు పెట్టుకుంది. అయితే ఆ మట్టిని తొలగించే క్రమంలో ఓ బుల్డోజర్‌ అక్కడికి వచ్చింది. అది గమనించిన పక్షి వెంటనే తన గుడ్లమీద వాలిపోయింది. ఆ బుల్డోజర్‌ నడుపుతున్న వ్యక్తి కూడా ఆ గుడ్లకు హాని కలగకుండా జాగ్రత్తగా మట్టి తొలగించాడు. ఇంకా బయటకు రాని తన పిల్లలకోసం ఆ పక్షి తపనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..