Bryan Johnson: నిత్య యవ్వనం కోసం రూ. 16 కోట్లు ఖర్చు.? ఏజ్ రివర్స్ చేసే సప్లిమెంట్స్
నిత్య యవ్వనంగా కనిపించే సీక్రెట్ ఒకటి అమ్మకానికి ఉంది. అది కూడా అత్యంత చవగ్గా. కేవలం 28 వేల రూపాయలకే మీరు దానిని సొంతం చేసుకొని వయసును రివర్స్ చేసుకోవచ్చు. ఇంకా నమ్మలేకపోతున్నారా? అయితే ఇది చూడండి. పెరుగుతున్న వయసును వెనక్కి మళ్లించే సీక్రెట్ సప్లిమెంట్స్ తన వద్ద ఉన్నాయంటున్నాడు అమెరికాకు చెందిన 46 ఏళ్ల మిలియనీర్ వ్యాపారవేత్త బ్రయన్ జాన్సన్.
నిత్య యవ్వనంగా కనిపించే సీక్రెట్ ఒకటి అమ్మకానికి ఉంది. అది కూడా అత్యంత చవగ్గా. కేవలం 28 వేల రూపాయలకే మీరు దానిని సొంతం చేసుకొని వయసును రివర్స్ చేసుకోవచ్చు. ఇంకా నమ్మలేకపోతున్నారా? అయితే ఇది చూడండి. పెరుగుతున్న వయసును వెనక్కి మళ్లించే సీక్రెట్ సప్లిమెంట్స్ తన వద్ద ఉన్నాయంటున్నాడు అమెరికాకు చెందిన 46 ఏళ్ల మిలియనీర్ వ్యాపారవేత్త బ్రయన్ జాన్సన్. ఆ సప్లిమెంట్లతో తాను తన వయసును 5.1 సంవత్సరాలు తగ్గించుకున్నట్టు చెప్పాడు. వయసును రివర్స్ చేసే ఈ సప్లిమెంట్లకు ఆయన ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ అని పేరు పెట్టాడు. ఇందులో డైట్‌తోపాటు వందకుపైగా రోజువారీ సప్లిమెంట్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు కోసం ఆయన ఏకంగా 2 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట.
ఇప్పుడీ యవ్వన సీక్రెట్‌ను ఫాస్ట్‌ఫుడ్ తినేందుకు అయ్యే ఖర్చుకంటే చవగ్గా అమ్ముతానని ప్రకటించాడు. 30 రోజులకు కేవలం 343 డాలర్లు అంటే దాదాపు 28,624 రూపాయలకే విక్రయిస్తానని ప్రకటించాడు. ఇందులో డ్రింక్ మిక్స్, ప్రొటీన్, 8 ట్యాబ్లెట్లు, స్నేక్ ఆయిల్, 67 పోటెంట్ మందులు, 400 కేలరీలు ఉంటాయి. 1000కిపైగా ప్రయోగాల అనంతరం వీటిని రూపొందించినట్టు తెలిపాడు. సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్ అయిన జాన్సన్ తన బ్లూప్రింట్ స్టాక్‌తో ఆహారం నుంచి 400 కేలరీలను ప్రత్యామ్నాయంగా తీసుకోవడం ద్వారా తన వయసును 5 ఏళ్లు వెనక్కి మళ్లించినట్టు చెప్పుకొచ్చాడు. ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌తో తన వయసును వెనక్కి తిప్పినట్టు ఆయన చెబుతున్నప్పటికీ దీనికి శాస్త్రీయ అధారాలు లేవు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

