Medical Personnel: వైద్య సిబ్బందికి సలామ్ కొడుతున్న గ్రామస్తులు.. ఇంతకీ వారేం చేశారంటే..

Medical Personnel: వైద్య సిబ్బందికి సలామ్ కొడుతున్న గ్రామస్తులు.. ఇంతకీ వారేం చేశారంటే..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jul 18, 2022 | 8:39 PM

చుట్టూ ముంచెత్తిన వరద నీరు.. మరోవైపు అనారోగ్య సమస్య.. పరిస్థితి విషమంగా ఉంది. అలాగని ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేదు. పోటెత్తుతున్న గోదావరి..


చుట్టూ ముంచెత్తిన వరద నీరు.. మరోవైపు అనారోగ్య సమస్య.. పరిస్థితి విషమంగా ఉంది. అలాగని ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేదు. పోటెత్తుతున్న గోదావరి వరద నీటితో రహదారులన్నీ కనమరుగయ్యాయి. దాంతో దిక్కు తోచని పరిస్థితి ఆ కుటుంబానికి. చివరకు విషయాన్ని వైద్యాధికారులకు తెలియజేయగా.. సాహసం చేసి వచ్చారు వైద్యులు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి తక్షణ చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఠాణేలంక గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ఠాణేలంక గ్రామానికి చెందిన 82 ఏళ్ళ జగతాడి వెంకాయమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్దామన్నా గ్రామం మొత్తం గోదావరి వరదల్లో చిక్కుకుపోయింది. ఛాతీ వరకు నీరు ప్రవహిస్తోంది. దారులన్నీ కనుమరుగయ్యాయి. దాంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు కుటుంబ సభ్యులు. చివరకు ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో.. వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తలంక పిహెచ్‌సీ వైద్య సిబ్బంది.. గుండె లోతు వరద నీటిలోనూ ఠాణేలంక గ్రామానికి వచ్చారు. నాయుడు, ఆశాకార్యకర్త సత్యవతి.. ఇద్దరూ ఆ వృద్ధురాలికి వైద్య పరీక్షలు చేశారు. హుటాహుటిన ఆమెను కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది సహాయంతో వరద నీటిలోనే మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స చేసి, ముమ్మిడివరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనికి తరలించారు. దాంతో ఇప్పుడు ఆమె క్షేమంగా ఉంది. కాగా, వరదల్లోనూ వృదురాలికి వైద్యం అందించిన వైద్య సిబ్బంది సేవలను గ్రామస్తులు కొనియాడారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 18, 2022 09:44 AM