Viral: చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట..

Viral: చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట..

Anil kumar poka

|

Updated on: Nov 29, 2024 | 3:23 PM

చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు ముందు స్పృహలోకి వచ్చిన ఘటన రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూలో వెలుగుచూసింది. అయినా అతడు కొద్ది గంటలకే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ముగ్గురు వైద్యులను అధికారులు సస్పెండ్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రోహితాశ్‌ కుమార్‌ (25) బధిరుడు. అతడికి కుటుంబం లేదు. కొన్నేళ్లుగా ఒక షెల్టర్‌హోమ్‌లో ఉంటున్నాడు.

రోహితాశ్‌ కుమార్‌ అపస్మారక స్థితికి జారిపోయాడు. వెంటనే అతడిని స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించి, అత్యవసర వార్డులో చికిత్స అందించారు. వైద్యానికి స్పందించడం లేదని మొదట చెప్పిన వైద్యులు.. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరణించినట్లు ప్రకటించారు. అతడి దేహాన్ని రెండు గంటలపాటు మార్చురీలో ఉంచారు. పోలీసుల పంచనామా అనంతరం దేహాన్ని స్థానిక శ్మశానానికి తరలించారు. చితిపై ఉంచాక, రోహితాశ్‌ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడాన్ని కొందరు గమనించారు. వెంటనే అంబులెన్స్‌ రప్పించి, అతడిని తిరిగి బీడీకే ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం అతడిని జైపుర్‌కు తరలిస్తుండగా, దారిలో మృతి చెందాడు. బాధితుడికి సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ముఖ్య వైద్య అధికారి సహా ముగ్గురు డాక్టర్లను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.