Viral Video: తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు సాటి ఈ సృష్టిలో మరేదీ లేదు. మనుషులైనా, జంతువులైనా.. ఆఖరికి విష సర్పాలలో అయినా తల్లి ప్రేమలో మాత్రం తేడా ఉండదు. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లులు ఉంటారో లేదో గానీ.. జంతువులు, పక్షులు మాత్రం ఈ విషయంలో వెనుకాడవు. ఇందుకు సాక్షంగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
మనుషులైనా, జంతువులైనా తమ రక్షణ, తమ పిల్లల రక్షణ కోసం ప్రయత్నించడం మామూలే. కానీ ఇక్కడ ఏనుగులు తమ పిల్లలను రక్షించుకునేందుకు చేసిన ఏర్పాటు మాత్రం మామూలుగా లేదు. కొన్ని ఏనుగులు, వాటి పిల్లలతో కలసి అడవిలో విహరిస్తున్నాయి. ఇంతలో అక్కడికి రెండు చిరుతపులులు దూసుకొచ్చాయి. వాటిని చూసిన ఏనుగులు… తమ పిల్లలను ఒకచోటికి చేర్చాయి. తమ పిల్లలను మధ్యలో ఉంచి, ఐదు ఏనుగులు వాటికి రక్షణగా ‘చక్ర వ్యూహం’ పన్నాయి. ఐదూ కూడా ఐదు వైపులకు తలను తిప్పి వలయంలా నిలిచాయి. ఎటువైపు నుంచి దాడి చేసినా గట్టిగా తిప్పికొట్టేందుకు రెడీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ‘ఎక్స్’లో వైరల్ గా మారింది. రెండు రోజుల్లోనే ఆరు లక్షల వరకు వ్యూస్, వేల కొద్దీ లైకులు వచ్చాయి. ఏనుగుల తీరు అద్భుతం, వలయంలా భలే వ్యూహం పన్నాయి అంటూ చాలా మంది అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘తల్లి ప్రేమకు ఇంతకంటే సాక్ష్యం.. ఇంకేమైనా ఉంటుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఏనుగుల తీరు చూస్తే.. పిల్లల రక్షణ కోసం జంతువులైనా, మనుషులైనా ఎంతగా తపిస్తారన్నది తెలిసిపోతోందని మరికొందరు అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

