Viral: కార్ ఎక్కి అతి చేసాడు.. పోలీసులు ఏం చెయ్యాలో అదే చేసారు..! ఊరుకుంటారా ఏంటి.?
ఇటీవల సోషల్ మీడియాలో లైక్స్ కోసం యువత రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కొందరు మితిమీర ప్రవర్తించడంతో విమర్శలు ఎదుర్కొంటారు. తాజాగా ఓ వ్యక్తి కారు రూఫ్ పైన ప్రమాదకర స్థితిలో విన్యాసాలు చేశాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసుల కంట పడింది. వెంటనే సదరు కారు యజమానికి భారీ చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు.
ఇటీవల సోషల్ మీడియాలో లైక్స్ కోసం యువత రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కొందరు మితిమీర ప్రవర్తించడంతో విమర్శలు ఎదుర్కొంటారు. తాజాగా ఓ వ్యక్తి కారు రూఫ్ పైన ప్రమాదకర స్థితిలో విన్యాసాలు చేశాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసుల కంట పడింది. వెంటనే సదరు కారు యజమానికి భారీ చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 18లో జరిగింది. ఈ వీడియోలో వైట్ మారుతి స్విఫ్ట్ కారును ఓ వ్యక్తి నడుపుతున్నడాఉ. యెల్లో టీ షర్ట్ ధరించిన మరో వ్యక్తి కారు రూఫ్‌పై విన్యాసాలు చేస్తున్నాడు. ఇతర వాహనాలను ఈ కారు ఓవర్‌టేక్ చేస్తూ దూసుకుపోవడంతో అటుగా వెళుతున్నవారు తీవ్ర భయాందోళన చెందారు. కారు ప్రమాదకర స్థితిలో దూసుకెళ్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ..నోయిడా ట్రాఫిక్ పోలీస్ అధికారులను ట్యాగ్ చేసారు. కారు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాహనాన్ని సీజ్ చేయాలని కొందరు యూజర్లు కోరారు. వైరల్ వీడియోపై స్పందించిన నోయిడా ట్రాఫిక్ పోలీసులు కారు యజమానిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం, కారు యజమానికి 26,000 రూపాయలు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

