Viral Video: తుపాకీ చూపించి నడి రోడ్డుపై హడలెత్తించిన యువతి.. కట్ చేస్తే సీన్ రివర్స్.
అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. నిత్యం ఏదో ఒక చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దుండగుల కాల్పులకు అమాయక పౌరులు చనిపోవడం, గాయపడటం సర్వసాధరణంగా మారింది. తాజాగా న్యూయార్క్ సమీపంలోని నసావు కౌంటీలో ఓ మహిళ తుపాకీతో హల్చల్ చేసింది.రోడ్డుమీదకు ఒక్కసారిగా వచ్చిన ఆ మహిళ ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపింది.నడిరోడ్డుపై గాల్లో కాల్పులు జరుపుతూ ..
అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. నిత్యం ఏదో ఒక చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దుండగుల కాల్పులకు అమాయక పౌరులు చనిపోవడం, గాయపడటం సర్వసాధరణంగా మారింది. తాజాగా న్యూయార్క్ సమీపంలోని నసావు కౌంటీలో ఓ మహిళ తుపాకీతో హల్చల్ చేసింది. రోడ్డుమీదకు ఒక్కసారిగా వచ్చిన ఆ మహిళ ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపింది. నడిరోడ్డుపై గాల్లో కాల్పులు జరుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న కార్ల వైపు తుపాకీ గురిపెట్టింది. తర్వాత తుపాకీని తన తలపై పెట్టుకుంది. దారినపోయే వాహనదారులు ఆమె ప్రవర్తనతో ఆందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఆమెను తమ వాహనంతో ఢీకొట్టి కిందపడేలా చేశారు. క్షణాల్లోనే ఆమెను చుట్టుముట్టి తుపాకీతో పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె వింత ప్రవర్తన, కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...