రూ.389 లాటరీ టికెట్‌ కొని.. రూ. 1.5కోట్లు గెలుచున్న యువకుడు

ఒక్కోసారి మ‌నం అనుకోకుండా చేసే ప‌నులే అదృష్టం తెచ్చిపెడ‌తాయి. అనుమానంగా చేసే ప‌నులే మ‌న‌కు లాభం చేకూర్చుతాయి. ఇలాంటి అనుభ‌వ‌మే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది.

Phani CH

|

Jun 25, 2022 | 9:46 AM

ఒక్కోసారి మ‌నం అనుకోకుండా చేసే ప‌నులే అదృష్టం తెచ్చిపెడ‌తాయి. అనుమానంగా చేసే ప‌నులే మ‌న‌కు లాభం చేకూర్చుతాయి. ఇలాంటి అనుభ‌వ‌మే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. అనుకోకుండా కొన్న లాట‌రీ కోట్లు తెచ్చిపెట్టింది. దీంతో అత‌డు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. యునైటెడ్ స్టేట్స్‌లోని సౌత్ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి ప‌నిముగించుకొని ఇంటికెళ్తూ అనుకోకుండా ఓ లాట‌రీ టికెట్స్ అమ్మే దుకాణం వ‌ద్ద ఆగాడు. ఎలాగో ఆగాం క‌దా అని గోల్డ్ 50 ఎక్స్ లాట‌రీ స్క్రాచ్ టికెట్‌ను ఐదు డాల‌ర్లకు అంటే మన ఇండియన్‌ నగదులో 389రూపాయలకు టికెట్‌ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి తాపీగా సోఫాలో ప‌డుకొని స్క్రాచ్ చేశాడు. అందులో అమౌంట్ చూసి అత‌డికి నోట మాట‌రాలేదు. అక్షరాల 1.5కోట్లు గెలుచుకోవ‌డంతో ఉబ్బిత‌బ్బిబైపోయాడు. అనంత‌రం లాట‌రీ టికెట్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు దుకాణానికి పరుగెత్తాడు. కాగా, ఆ డ‌బ్బుల‌తో ఏంచేస్తాడో అత‌డు ఇంకా వెల్లడించ‌లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీదా పోయి మ్యాన్‌హోల్‌లో పడిన పోలీసు దంపతులు !! కొంచెం అయితే..

Viral: చేపలకు ఆహారం వేస్తున్న చింపాంజీ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

ఆన్‌లైన్‌లో కుర్చీ ఆర్డర్ చేస్తే.. పార్శిల్‌లో వచ్చింది చూసి కళ్లు బైర్లు కమ్మాయ్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu