గృహిణిగా ఉండాలంటే భర్త ఆస్తిలో సగం వాటా ఇవ్వాలి

గృహిణిగా ఉండాలంటే భర్త ఆస్తిలో సగం వాటా ఇవ్వాలి

Phani CH

|

Updated on: Jul 02, 2024 | 10:29 PM

ఉద్యోగం మాని ఇంటిపట్టునే ఉంటూ కుటుంబం బాగోగులు చూడమని కోరిన భర్తను అతడి కంపెనీలో సగం వాటా కోరిన భార్య ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తొలుత అపరాధ భావనకు లోనైన మహిళ తన సమస్యను నెటిజన్లతో పంచుకుంది. అయితే, నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. తమకు పెళ్లై ఆరేళ్లు అవుతోందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను మళ్లీ గర్భవతినని తెలిపింది.

ఉద్యోగం మాని ఇంటిపట్టునే ఉంటూ కుటుంబం బాగోగులు చూడమని కోరిన భర్తను అతడి కంపెనీలో సగం వాటా కోరిన భార్య ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తొలుత అపరాధ భావనకు లోనైన మహిళ తన సమస్యను నెటిజన్లతో పంచుకుంది. అయితే, నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. తమకు పెళ్లై ఆరేళ్లు అవుతోందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను మళ్లీ గర్భవతినని తెలిపింది. తన భర్త మంచి సంపాదనపరుడని, ఆర్థికంగా తమకు ఎటువంటి లోటు లేదని వివరించింది. ఆర్థికంగా తాము ఉన్నతస్థితిలో ఉండటంతో తనను ఉద్యోగం మానేసి గృహిణిగా ఉండాలని భర్త కోరినట్టు మహిళ చెప్పుకొచ్చింది. కుటుంబం, పిల్లలు బాగోగులు చూసుకోవాలని చెప్పాడని తెలిపింది. అయితే, తాను కెరీర్ వదులుకుని గృహిణిగా ఉండిపోవాలంటే భర్తను తన కంపెనీలో సగం వాటా కోరానని చెప్పుకొచ్చింది. ఇందుకు గల కారణాలను విపులంగా రాసుకొచ్చింది. దురదృష్టవశాత్తూ భవిష్యత్తులో తాము విడిపోతే లేటు వయసులో మళ్లీ తను ఉద్యోగం చేయాల్సి వస్తుందని వివరించింది. అప్పటికి తన నైపుణ్యాలు పనికిరాకుండా పోతాయని, పోషణ కోసం చిన్నా చితకా ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడని.. బోరుమన్న విద్యార్థులు

అదంతా ఫేక్ న్యూస్.. వాట్సాప్‌లో వచ్చేదంతా నమ్మితే ఎలా ??

వాహనదారులకు స్పూర్తిగా నిలుస్తున్న ఆవు.. ఏం చేసిందంటే ??

అయ్యోరామా.. థాంక్యూ చెప్తే విమానం ఎక్కనివ్వారా ??

రాత్రి వేళ పండ్లు తింటున్నారా ?? జాగ్రత్త.. ఆ ఫ్రూట్స్ తింటే డేంజర్ !!