గుడ్‌ న్యూస్‌.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు

గుడ్‌ న్యూస్‌.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు

Phani CH

|

Updated on: Nov 29, 2023 | 9:58 AM

విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్‌. తాజాగా మలేషియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మలేసియా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పించింది. చైనా పౌరులకు కూడా ఈ ఆఫర్ కల్పించింది. డిసెంబర్ 1 నుంచి భారతీయులు, చైనీయులు వీసా లేకుండానే తమ దేశానికి రావొచ్చని మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు.

విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్‌. తాజాగా మలేషియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మలేసియా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పించింది. చైనా పౌరులకు కూడా ఈ ఆఫర్ కల్పించింది. డిసెంబర్ 1 నుంచి భారతీయులు, చైనీయులు వీసా లేకుండానే తమ దేశానికి రావొచ్చని మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. 30 రోజులపాటు దేశంలో గడపొచ్చని వివరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వివరాలు చెప్పారు. భద్రతకు సంబంధించిన స్క్రీనింగ్ మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులు, ఇన్వెస్టర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీసాతో ముడిపడిన ప్రక్రియను సులభతరం చేయాలని యోచిస్తున్నట్టు గత నెలలోనే ప్రధాని అన్వర్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్, చైనా దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యాలను కల్పించనున్నట్టు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Daily Horoscope: ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు

తిడుతున్నారా.. పొగుడుతున్నారా.. మల్లారెడ్డి మాటలకు బిత్తరపోయిన రణ్‌బీర్

హీరోయిన్‌ను టచ్‌ చేసి ఫోటోకు ఫోజిస్తే.. 30 లక్షలా

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా.. మాస్‌ వార్నింగ్.. వీడియో

Animal: ‘యానిమల్’ ఓ స్టార్ బయోపిక్.. అసలు విషయం చెప్పిన రణ్‌బీర్