YouTuber Vasan: నీ ఛానల్‌ మూసేయ్‌.. యూట్యూబర్‌ వాసన్‌ పై కోర్టు ఆగ్రహం..

YouTuber Vasan: నీ ఛానల్‌ మూసేయ్‌.. యూట్యూబర్‌ వాసన్‌ పై కోర్టు ఆగ్రహం..

Anil kumar poka

|

Updated on: Oct 07, 2023 | 9:44 PM

రోడ్లపై బైక్‌తో స్టంట్‌ లు చేసి ప్రమాదానికి గురైన కేసులో అరెస్టయిన ఓ యూట్యూబర్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. అసలేం జరిగిందంటే.. టీటీఎఫ్‌ వాసన్‌ యూట్యూబ్‌లో చాలా పాపులర్‌. బైక్‌ స్టంట్లు, రోడ్ ట్రిప్పులపై వీడియోలు చేసి పోస్ట్‌ చేస్తుంటాడు. అతడి ఛానల్‌కు లక్షల మంది ఫాలోవర్లున్నారు. సెప్టెంబరు 17న అతడు ఓ రోడ్‌ ట్రిప్‌లో భాగంగా చెన్నై-వేలూరు హైవేపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాడు.

రోడ్లపై బైక్‌తో స్టంట్‌ లు చేసి ప్రమాదానికి గురైన కేసులో అరెస్టయిన ఓ యూట్యూబర్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. అసలేం జరిగిందంటే.. టీటీఎఫ్‌ వాసన్‌ యూట్యూబ్‌లో చాలా పాపులర్‌. బైక్‌ స్టంట్లు, రోడ్ ట్రిప్పులపై వీడియోలు చేసి పోస్ట్‌ చేస్తుంటాడు. అతడి ఛానల్‌కు లక్షల మంది ఫాలోవర్లున్నారు. సెప్టెంబరు 17న అతడు ఓ రోడ్‌ ట్రిప్‌లో భాగంగా చెన్నై-వేలూరు హైవేపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. దమాల్‌ సమీపంలో బైక్‌పై స్టంట్స్ చేస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లాడు. అయితే, ఆ సమయంలో అతడు హెల్మెంట్‌, రేస్‌ సూట్‌ వేసుకుని ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అతడి చేతికి ఫ్రాక్చర్‌ అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. సెప్టెంబరు 26న అతడి బెయిల్‌ పిటిషన్‌ను కాంచిపురం సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. అతడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. వాసన్‌ పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తూ.. వాసన్‌కు యూట్యూబ్‌లో 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని అతడు రూ.20లక్షల ఖరీదు చేసే బైక్‌పై రూ.3లక్షల రేస్‌ సూట్‌ ధరించి ప్రమాదకర స్టంట్లు చేస్తున్నాడని తెలిపారు. అంతేకాదు.. ఖరీదైన బైక్‌లు కొనుగోలు చేసి రేస్‌లకు రావాలని యువతను ప్రేరేపిస్తున్నాడని ఇది అత్యంత ప్రమాదకరం అని న్యాయస్థానంలో వాదించారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ‘‘యువతను ప్రమాదకర ర్యాష్‌ డ్రైవింగ్‌ వైపు ప్రేరేపిస్తున్న అతడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఇది అతడికో గుణపాఠం కావాలి. ఇక ఆ యూట్యూబర్‌ తన ఛానల్‌ను తక్షణమే మూసివేయాలి’’ అని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని వాసన్‌కు సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..