Constable: మరణం తర్వాత దక్కిన విజయం.. గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు.
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివాడు. పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో విజేతగా నిలిచాడు. కానీ ఆ ఫలితాన్ని అందుకునేందుకు ఈ లోకంలో లేకుండా పోయాడు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పాతతండాకు చెందిన భూక్య ప్రేమ్‌కుమార్, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు ప్రవీణ్ బీటెక్ పూర్తి చేశాడు.
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివాడు. పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో విజేతగా నిలిచాడు. కానీ ఆ ఫలితాన్ని అందుకునేందుకు ఈ లోకంలో లేకుండా పోయాడు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పాతతండాకు చెందిన భూక్య ప్రేమ్‌కుమార్, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు ప్రవీణ్ బీటెక్ పూర్తి చేశాడు. పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు రాసిన అనంతరం సివిల్స్ ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్లాడు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని నాలుగు రోజులు సెలవులు రావటంతో ఖమ్మంలో తన స్నేహితుని కలిసేందుకు వెళ్లిన ప్రవీణ్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 17న స్నేహితునితో కలిసి నగరంలో ఓ ఫ్లెక్సీని కడుతుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ప్రవీణ్ కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన కొడుకు పెద్ద ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉంటాడని వారు కన్న కలలన్నీ కల్లలయ్యాయి. తాజాగా ప్రవీణ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడని తెలియడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

