YouTube: వీడియో తీస్తున్న వ్యక్తి పక్కనే పిడుగు పడితే..? వీడియో షూట్ చేస్తుండగా పడ్డ పిడుగు..

YouTube: వీడియో తీస్తున్న వ్యక్తి పక్కనే పిడుగు పడితే..? వీడియో షూట్ చేస్తుండగా పడ్డ పిడుగు..

Anil kumar poka

|

Updated on: Oct 07, 2023 | 9:35 PM

సోషల్‌ మీడియాలో పిడుగుపాటుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే ఒక వీడియో వైరల్‌గా మారింది. వన్యప్రాణి కార్యకర్త, జీవశాస్త్రవేత్త ఒకరు ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ సిటీలో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. ఆ భయానక క్షణం వీడియోలో నిక్షిప్తమై, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాక్స్ న్యూస్ వివరాల ప్రకారం 35 ఏళ్ల ఫారెస్ట్ గాలంటే..

సోషల్‌ మీడియాలో పిడుగుపాటుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే ఒక వీడియో వైరల్‌గా మారింది. వన్యప్రాణి కార్యకర్త, జీవశాస్త్రవేత్త ఒకరు ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ సిటీలో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. ఆ భయానక క్షణం వీడియోలో నిక్షిప్తమై, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాక్స్ న్యూస్ వివరాల ప్రకారం 35 ఏళ్ల ఫారెస్ట్ గాలంటే.. సౌత్ ఫ్లోరిడాలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోను షూట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అడవిలో ఓ నీటి కుంటలో నిలుచుకున్న ఫారెస్ట్ గాలంటే మాట్లాడుతూ, తమకు అద్భుతమైన షాట్‌లు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. వర్షం పడడం మొదలవుతోందని ఇది ఫ్లోరిడా అని.. ఇక్కడ తరచూ వర్షాలు కురుస్తుంటాయన్నారు. అన్ని వేళలా మెరుపులు, ఉరుములు కనిపిస్తాయి అని చెప్పారు. ఇంతలో అతని పక్కనే పిడుగుపడింది. దీంతో అతను కిందికి వంగాడు. ఈ ఘటన తర్వాత అతను మాట్లాడుతూ ఆ సమయంలో తన మైండ్‌ మొద్దుబారిపోయిందని విపరీతమైన వెలుగు రావడంతో తను ఏమీ చూడలేకపోయాననీ అన్నారు. ఘటనలో తనకు కానీ తన బృందానికి కానీ పెద్దగా గాయాలు కాలేదు కానీ తన శరీరమంతా నొప్పిగా ఉందని, తన గొంతు ఎండిపోయినట్లుందని గాలంటే తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..