దారుణం.. ప్రభుత్వ ఉద్యోగం పోతుందని.. పసికందును బండరాయి కింద పెట్టి
ప్రభుత్వ ఉద్యోగం పోతుందన్న భయంతో ఓ టీచర్ తన భార్యతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. నాలుగో సంతానంగా పుట్టిన పండంటి మగబిడ్డను బండరాయి కింద పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా జిల్లా నందన్‌వాడీ గ్రామంలో జరిగింది. గ్రామ సమీపంలోని ఓ గుట్టపై ఇటీవల ఓ శిశువు ఏడుపు వినిపించింది.
మార్నింగ్ వాకర్స్ ఆ శిశువు ఏడుపును పసిగట్టి అక్కడికి వెళ్లారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శిశువు బండరాళ్ల కింద ఉండడాన్ని చూసి స్థానికులు షాక్ అయ్యారు. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. చలికి వణికిపోతున్న మూడు రోజుల పసికందును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత శిశువు తల్లిదండ్రులు బబ్లు దండోలియా, భార్య రాజకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. ఇప్పటికే తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు. తాను ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నట్లు బబ్లు పోలీసులకు తెలిపాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఏ ఉద్యోగికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదు. దీంతో నలుగురు పిల్లలు అని ప్రభుత్వానికి తెలిస్తే తన ఉద్యోగం పోతుందనే భయంతోనే మూడు రోజుల పసికందును బండరాయి కింద పెట్టినట్లు దండోలియా దంపతులు పోలీసులకు తెలిపారు. దండోలియా దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు శిశువు, తల్లిదండ్రుల డీఎన్ఏ నమూనాలను పరీక్షకు పంపించారు. ఆ రిపోర్టును బట్టి పేరెంట్స్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అడవిలో రాళ్ల కింద ఆ పిల్లవాడు వణుకుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. శిశువుపై చీమలు పాకుతున్నాయని, ఒళ్లంతా గాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం శిశువు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల విషయంపై స్పష్టత వచ్చే వరకు ఆ శిశువును ప్రభుత్వ సంరక్షణలోని శిశు గృహంలో ఉంచామని అన్నారు. మూడో సంతానం పుడితే ఉద్యోగం నుంచి తొలగించేలా 2001లో మధ్యప్రదేశ్ విద్యాశాఖలో నిబంధన ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం ఈ నియమాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే కొంతమంది కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు
Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..
దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే
రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

