Snakes in Hospital: పాములు బాబోయ్ పాములు.. ఇది ఆస్పత్రా పాములపుట్టా..! బెడ్ కదిలిస్తే కుప్పలే..
బాబోయ్ పాములు.. ఒకటి కాదు.. రెండు కాదు.. అడుగడుగునా పాములే. ఎటు చూసినా విష సర్పాలే. ఆస్పత్రిలో ఈ విషసర్పాలు తిష్ట వేయడంతో పేషెంట్స్ హడలిపోతున్నారు.
బాబోయ్ పాములు.. ఒకటి కాదు.. రెండు కాదు.. అడుగడుగునా పాములే. ఎటు చూసినా విష సర్పాలే. ఆస్పత్రిలో ఈ విషసర్పాలు తిష్ట వేయడంతో పేషెంట్స్ హడలిపోతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం లో పాములు చెలరేగిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరద పోటెత్తింది. జిల్లాలోని ఎంసీహెచ్ సైతం నీటమునిగింది. వరద నీటిలో విషసర్పాలు కొట్టుకు వస్తున్నాయి. ఆ బురదలోనే తిష్ట వేసిన పాములు.. ఆస్పత్రి క్లీనింగ్ సిబ్బందిని కాటు వేశాయి. ఆస్పత్రిలోని ల్యాబొరేటరీలు, అల్ట్రా సౌండ్ ఎక్స్‌రే యంత్రాలు, లేబర్ రూమ్ అన్నీ నీటిలో మునిగిపోయాయి. 3 కోట్ల విలువ చేసే పరికరాలతోపాటు అత్యంత ఖరీదైన మందులు కూడా వరద పాలయ్యాయి. ఆస్పత్రిలో బురద క్లీన్ చేస్తుండగా.. ఈ పాములు బయటపడ్డాయి. పారిశుద్ధ్య పనులు చేస్తున్న సునీత అనే కార్మికురాలిని పాము కాటు వేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పాము కాటు ఘటనతో ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

