Monkey – baby: దారుణం..! పసికందును టెర్రెస్ పైనుంచి విసిరికొట్టి.. చంపిన కోతి..!
కోతులు గుంపులు గుంపులుగా తిరగడంతో.. మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు రోడ్ల పైకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఓ కోతి నాలుగు నెలల చిన్నారిని
కోతులు గుంపులు గుంపులుగా తిరగడంతో.. మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు రోడ్ల పైకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఓ కోతి నాలుగు నెలల చిన్నారిని నాలుగంతస్తుల భవనం పై నుంచి విసిరివేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దుంకా గ్రామంలో నివసించే నిర్దేశ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి తన భార్య, నాలుగు నెలల కుమారుడితో కలిసి ఇంటి టెర్రస్ పైకి వచ్చాడు. ఆ సమయంలో కోతుల గుంపు రూఫ్ మీదకు వచ్చింది. ఒక్కసారే కోతుల గుంపు చూడగానే భార్యాభర్తలు భయపడిపోయారు. అప్పటికీ ధైర్యం చేసి నిర్దేశ్ వాటిని తరిమేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆ కోతలు అతడిని చుట్టుముట్టాయి. మెట్లవైపు పరిగెత్తే ప్రయత్నంలో చేతుల్లోని పసిబిడ్డ జారిపోయాడు.ఐ నిర్దేశ్ చిన్నారిని అందుకునేలోపు ఓ కోతి ఆ చిన్నారిని పట్టకుని డాబా పైనుంచి కిందికి విసిరేసింది. అంత పై నుంచి పడడంతో ఆ పసిబిడ్డ అక్కడిక్కడే మృతి చెందాడు. తమ కళ్లముందే బిడ్డ చనిపోవడంతో నిర్దేశ్ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. తమ చుట్టుపక్కల కోతుల బెడద ఎక్కువగా ఉందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

