Viral: బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార.. దేనికి సంకేతం!

Viral: బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార.. దేనికి సంకేతం!

Anil kumar poka

|

Updated on: Jul 31, 2024 | 8:47 AM

నంద్యాల జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వేపచెట్టు నుంచి పాలు ధారాపాతంగా ఉబికి వచ్చాయి. అది గమనించిన స్థానికులు ఈ వింతను చూసేందుకు పోటెత్తారు. వేపచెట్టునుంచి పాలు కారడం ఇదే మొదటిసారి కాదు.. ఇలాంటి సంఘటనలు తరచూ పలుచోట్ల జరగడం.. నెట్టింట ఎన్నో చూశాం. కానీ ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఏకంగా 12 అడుగుల పైనుండి జలపాతంలా వేప చెట్టు నుంచి పాలు కారుతుండడం చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో మూగి తిమ్మరెడ్డికి సంబంధించిన తోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. 12 అడుగుల పై నుండి పాలధార కారుతూనే ఉంది. జనాలు తండోపతండాలుగా వచ్చి చూసి వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతోందని అందరూ చర్చించుకున్నారు. అయితే ఈ ఘటన తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందన్నారు గ్రామ ప్రజలు. గత మూడు రోజులుగా వేప చెట్టుకు పాలు కారుతున్నాయి అన్న ప్రచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ వేప చెట్టును చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. ఆ వేపచెట్టును ఎల్లమ్మ దేవతగా భావించి పసుపు, కుంకుమలతో పూజలు చేస్తున్నారు. అయితే సైంటిస్టులు మాత్రం వేప చెట్టుకు పాలు కారడం అనేది సహజమని అన్నారు. ఓ విధమైన రసాయనాన్ని చెట్టు విడుదల చేయడం ద్వారా ఆ విధంగా తెల్లని రంగులో ద్రవపదార్థం వస్తుందన్నారు. అయితే ఇవి పాలు కావని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.