సిరిసిల్ల నేత కళాకారుడి ‘ఊసరవెల్లి’ చీర.. చూస్తే అదరహో అనాల్సిందే.!

| Edited By: Ravi Kiran

Sep 26, 2023 | 7:58 PM

గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను సృష్టించి చేనేత రంగంలో తన ప్రతిభను చాటారు సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల పరంధాములు. ఆయన వారసత్వాన్నే ఆయన కుమారుడు నల్ల విజయ్ కొనసాగిస్తున్నారు. చేనేత రంగంలో ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ అబ్బురపరుస్తున్నారు. తన తండ్రిదారిలోనే నడుస్తున్న విజయ్..

గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను సృష్టించి చేనేత రంగంలో తన ప్రతిభను చాటారు సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల పరంధాములు. ఆయన వారసత్వాన్నే ఆయన కుమారుడు నల్ల విజయ్ కొనసాగిస్తున్నారు. చేనేత రంగంలో ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ అబ్బురపరుస్తున్నారు. తన తండ్రిదారిలోనే నడుస్తున్న విజయ్ తాజాగా అద్భుతమైన చీరను ఆవిష్కరించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే చీరను రూపొందించారు. ఈయన ప్రతిభను చూసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పొగడ్తలతో ముంచేశారు. ఇలాంటి అద్భుతాలు మరిన్ని సృష్టించాలంటూ అభినందించారు. తెలంగాణ సెక్రటేరియట్‎లో తాజాగా కేటీఆర్ నేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించిన ఊసరవెల్లి చీరను ఆవిష్కరించారు.

ఈ ఊసరవెల్లి చీరను తయారు చేసేందుకు 30 గ్రాముల బంగారాన్ని, 500 గ్రాముల వెండిని వాడారు. వీటితో పాటే విభిన్న రంగులు మారే పట్టు పోగులను సుమారు 30 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. ఈ చీర తయారు కావడానికి రూ.2.80లక్షలు ఖర్చు అయ్యిందని విజయ్ తెలిపారు. రంగులు మారే ఈ చీర పొడవు 6.30 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు. బరువు 600 గ్రాముల వరకు ఉంటుంది. ప్రముఖ బిజినెస్‎మెన్ దూరపుడి విష్ణు, విజయ్‎లోని టాలెంట్‎ను గుర్తించి ఈ స్పెషల్ చీర ఆర్డర్ ఇచ్చారు. గతంలోనే విజయ్ సుగంధాలు వెదజల్లే చీరను తయారు చేసి ఆశ్చర్యపరిచారు. అతి త్వరలోనే రూ.25 లక్షల ఖరీదు పలికే మరో అద్భుతమైన చీరను రూపొందించనున్నట్లు తెలిపారు.