AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kilipaul Danc: భోజ్‌పురి పాటకు డ్యాన్స్ ఇరగదీసిన అన్న,చెల్లెలు.! నెట్టింట దూసుకుపోతున్న వీడియో!

Kilipaul Danc: భోజ్‌పురి పాటకు డ్యాన్స్ ఇరగదీసిన అన్న,చెల్లెలు.! నెట్టింట దూసుకుపోతున్న వీడియో!

Anil kumar poka
|

Updated on: Dec 13, 2022 | 9:36 AM

Share

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి.


సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. చెప్పాలంటే ఈ రోజుల్లో రీళ్ల యుగం నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి రీళ్లు, వీడియోలు చూసి.. నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.‘పట్లీ కమరియా మోర్’ అనే భోజ్‌పురి పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సాంగ్ కు చాలామంది డ్యాన్స్ చేసి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల ఈ సాంగ్ కు ఓ మహిళా టీచర్ క్లాస్‌రూమ్‌లో పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు ఈ పాటకు టాంజానియాలో కూడా క్రేజ్ వచ్చింది. టాంజానియాకు చెందిన అన్నా చెల్లెల్లు కైలీ, తన సోదరితో కలిసి ఈ భోజ్‌పురి పాటకి డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ స్టీమీ డ్యాన్స్ వీడియోను కైలీ పాల్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కైలీ తన సోదరి నీమా పాల్‌ను కూడా ట్యాగ్ చేశారు. కాగా ఈ వీడియోను కోటిమందికి పైగా వీక్షించారు. 10 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. మీరు చేసిన డ్యాన్స్ చాలా డిఫరెంట్‌గా అద్భుతంగా ఉందంటూ కామెంట్స్‌ చేశారు. ఓ యూజర్‌ ‘ఈ సోదరుడు నిప్పు వంటి వాడు’ అంటూ కైలీ పాల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 13, 2022 09:36 AM